మనిషి చనిపోయాక మృతదేహాన్ని గంట బయట ఉంచితే దుర్వాసన వచ్చేస్తుంది. ఇక దహన సంస్కారాలు లేటు అవుతాయనుకుంటే.. ఐస్ బాక్స్ కంపల్సరీ. అందులో ఉంచితేనే నాలుగు, ఐదు రోజులైనా వాసన రాకుండా ఉంటుంది. మృతదేహం కూడా కుళ్లిపోదు. అదే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం శవాన్ని చెక్కపెట్టలో పెట్టి పూడ్చితే.. కొన్ని రోజులుకు చర్మం అంతా కుళ్లి మట్టిలా మారిపోతుంది. కేవలం అస్థి పంజరం మాత్రమే మిగులుతుంది. అయితే శరీరాన్ని కుళ్లకుండా మమ్మీ లాంటి ప్రయోగాలు జరిగాయి. అలాగే కొన్ని లేపనాలు, రసాయనాల మధ్య శరీరాన్ని పాడు కాకుండా ఎంబాల్మ్ వంటి ప్రయోగాలు చేస్తారు. కానీ కొన్ని సార్లు మనల్ని నమ్మలేని నిజాలు పలకరిస్తూ ఉంటాయి. మన కళ్లనీ మనమే నమ్మలేని విదంగా అద్బుతాలు జరుగుతుంటాయి. అటువంటిదే ఇది. నాలుగేళ్లైనా ఓ మహిళ మృతదేహం చెక్కు చెదరలేదట. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
అంతర్జాతీయ మీడియా నివేదిస్తున్న ప్రరకరాం.. ఆ మృతదేహం ఓ క్రైస్తవ సన్యాసినిది. గోవెర్ పట్టణంలో క్యాథలిక్ సన్యాసిని సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ 95 ఏళ్ల వయస్సులో 2019 మే లో చనిపోయారు. ఆమె మృతదేహానికి క్రైస్తవ మత ఆచారాల ప్రకారం.. చెక్క పెట్టలో పెట్టి ఖనం చేశారు. అయితే మత ఆచారం ప్రకారం ఆమె మృతదేహాన్ని ప్రార్థనా మందిరంలోని బలిపీఠం కిందకు అవశేషాలను తరలించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో ఆమెను ఖననం చేసిన ప్రదేశంలో శవపేటిక వెలికి తీశారు. తెరిచి చూడగా.. ఆశ్చర్యపోవడం వారి వంతైంది. అవశేషాలు ఉంటాయి అనుకుంటే.. ఆమె భౌతిక కాయం చెక్కుచెదరకుండా ఉండటం చూసి విస్తుపోయారట. దీన్నే ప్రార్థనా మందిరంలోని బలిపీఠం కిందకు తీసుకురావాలని నిర్ణయించారట. అయితే ఈ విషయం తెలిసిన ప్రజలు ఆమె మృతదేహాన్ని చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారట. ఆమె మృతదేహానికి ఎంబాల్మ్ చేయనప్పటికీ అలాగే ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.