నేరాల్లో చాలా వరకు దొంగతనాలే ఉంటాయి. చాలామంది సినిమాల్లో భారీ దొంగతనాల సీన్లు చూసి వామ్మో అంటూ ఉంటారు. అయితే నిజ జీవితంలో ఆ తరహాలో దొంగతనాలు జరగడం కాస్త అరుదనే చెప్పాలి. కానీ, సినీ ఫక్కీలో ఒక దొంగతనాన్ని యత్నం జరిగింది. డబ్బు కొట్టేసేందుకు ఏకంగా విమానాశ్రయంలోకే దూసుకెళ్లారు.
దొంగతనం.. మీ నిత్య జీవితంలో ఈ విషయంపై ఎన్నో వార్తలు వినే ఉంటారు. దీనికి సంబంధించి మీకు స్వీయ అనుభవం కూడా ఉండి ఉండచ్చు. ఇంక సినిమాల విషయానికి వస్తే.. దొంగతనం మీద ఒక రేంజ్ లో యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. బేబీ డ్రైవర్, ఫాస్ట్ అండ్ వ్యూరియస్, మనీ హెయిస్ట్, మిషన్ ఇంపాజిబుల్, రోనిన్, ఇన్ సైడ్ మ్యాన్ ఇలా చాలానే సినిమాలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఆడియన్స్ ఎంతో థ్రిల్ ఫీలవుతుంటారు. అలా సినిమాల్లో జరిగే భారీ దొంగతనాన్ని రియల్ లైఫ్ లో ట్రై చేశారు. ఏకంగా రూ.260 కోట్లు కొల్లగొట్టేందుకు ఫివలయత్నం చేశారు.
విమానంలో బ్యాంకులకు సరఫరా చేసేందుకు 32.5 మిలియన్ డాలర్లను విమానంలో తరలిస్తున్నారు. ఒక విమానంలో అంత మొత్తంలో డబ్బు ఉందని తెలుసుకుని ఒక ముఠా కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేసింది. ఫ్లోరియాలోని మియామీ నుంచి రూ.262 కోట్లను చిలీకి తీసుకొచ్చారు. ఆ మొత్తాన్ని చిలీలో ఉన్న పలు బ్యాంకులకు తరలించాలి. శాంటియాగోలోని విమానాశ్రయంలో ఈ డబ్బుని ట్రక్కులోకి ఎక్కిస్తుండగా ఓ ఘరానా దొంగల ముఠా ఒకటి దాడికి తెగబడింది. సినిమా స్టైల్లో ఓ ట్రక్కుతో విమానాశ్రయ గేటుని బద్దలు కొట్టి రన్ వేపైకి దూసుకొచ్చారు. భద్రతా సిబ్బందిపై దాడికి దిగి వారి వద్దనున్న ఆయుధాలను లాక్కున్నారు.
అప్రమత్తమైన ఎయిర్ పోర్టు పోలీసులు దొంగలపై దాడి చేశారు. పోలీసులను ఎదుర్కొనలేక ఆ ముఠా తోకముడిచింది. ఆ ముఠాలో ఓ సభ్యుడు కాల్పుల్లో హతమవ్వగా.. ఎయిర్ పోర్టులో పనిచేసే ఓ ఉద్యోగి కూడా ప్రాణాలు కోల్పోయాడు. డబ్బు సురక్షితంగానే ఉందని సిబ్బంది వెల్లడించంది. అయితే ఇక్కడ అలాంటి ఘటనలు జరగడం కొత్తేం కాదని చెబుతున్నారు. 2020లో కూడా ఎయిర్ పోర్టు గోదాములో ఉంచిన 15 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అపరహించారు. ఆరేళ్ల క్రితం 10 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దొంగిలించారు. ఆ అనుభవాల వల్ల కావచ్చు అక్కడ ఇది పెద్ద ఘటనగా వాళ్లు పరిగణించలేదనుకుంటా. విమానాశ్రయంలోకి దూసుకెళ్లి దాడికి దిగడటం అంటే ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. దొంగలు అంతకు తెగించారా అనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
1/ 🚨🇨🇱💥 – Shooting on the runway of the #Santiago de #Chile Airport. Robbers tried to steal 32 million from an armored truck. 1 officer dead (you can see on the video when another officer performs CPR) and 1 robber dead. pic.twitter.com/lneBrIN0FT
— The informant (@theinformantofc) March 8, 2023