వరుస భూకంపాల ధాటికి టర్కీ, సిరియా దేశాలు కకావికలం అవుతున్నాయి. గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు చోటుచేసుకోవడంతో భారీ అస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం ఉంటోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు మృతుల సంఖ్య 2300 దాటిపోగా, క్షతగాత్రుల సంఖ్య వేలల్లో ఉంది. ఇవి అధికారిక లెక్కల మాత్రమే. భవన శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వారెందరో ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో మొదలైన ఈ ప్రకృతి విపత్తులు, మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో భారీ తీవ్రతతో సంభవించాయి.
మొదట సోమవారం ఉదయం 4.17 గంటల ప్రాంతంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ధాటికి వేలాది భవంతులు నేలమట్టమయ్యాయి. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన సిబ్బంది.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నాలు జరుగుతుండగానే మధ్యాహ్నం 1.24 గంటల సమయంలో 7.8 తీవ్రతతో మరోసారి సంభవించింది. అయినప్పటికీ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అలాంటి సమయంలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 6.0 తీవ్రతతో మూడోసారి భూకంపం సంభవించింది. ఇలా గడచిన 24 గంటల వ్యవధిలోనే మూడు సార్లు భారీ తీవ్రతతో భూమి కంపించింది. మొత్తంగా ఇప్పటివరకు 50 సార్లు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకుటున్నట్లు భూకంప అధ్యయన కేంద్రాలు వెల్లడించాయి.
Heartbreaking Photo of The Day 😭💔#earthquake #Turkey #PrayForTurkey #deprem #Grammys2023 #زلزال #Turkiye #هزة_أرضية #Syria #photography #syriaearthquake #Syrie #TurkeyEarthquake pic.twitter.com/UEUo8kx6UX
— Sabir khan (@KhanKha55801807) February 6, 2023
కాగా, ఈ విషాద ఘటనల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, వైద్య సిబ్బందిని టర్కీ పంపాలని నిర్ణయించారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గాయపడిన వారికి అవసరమైన ఔషధాలు, ఇతర సహాయక సామాగ్రి కూడా ఈ బృందాలు భారత్ నుంచి తీసుకెళ్తున్నాయి. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో కనీసం వందమంది సిబ్బంది ఉంటారని.. వీరు టర్కీ ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని మనమూ ఆశిద్దాం..
Saddest picture on internet today#Turkey #TurkeyQuake .
Pray For Turkiye, Syria & Lebanon 😥💔 pic.twitter.com/rUPH2eLNjn— AAYUSHMAAN PANIGRAHI (@aayushmaan_21) February 6, 2023
Deeply pained to learn that the devastating earthquake has also affected Syria. My sincere condolences to the families of the victims. We share the grief of Syrian people and remain committed to provide assistance and support in this difficult time.
— Narendra Modi (@narendramodi) February 6, 2023