రోమన్ల రాజ్యంగా పిలుచుకునే టర్కీలో ప్రకృతి విలయతాండవం సృష్టిస్తోంది. వరుసగా గంటల వ్యవధిలోనే రెండోసారి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6గా నమోదైంది. ఇప్పటికే సోమవారం తెల్లవారు జామున 4.17 గంటల సమయంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించగా.. 1500 మందికిపైగా మరణించారు. భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలిపోయాయి. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని రక్షించే ప్రయత్నాలు జరుగుతుండగానే మరోసారి భూకంపం సంభవించింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దక్షిణ టర్కీలోని కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లోని ఎల్బిస్తాన్ జిల్లాలో రెండోసారి భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావం కారణంగా డమాస్కస్, లటాకియా, సిరియన్ ప్రావిన్సులలలో కూడా స్వల్పమేర కంపించినట్లు తెలిపారు. కాగా, భారీ భూకంపాలతో తీవ్రంగా నష్టపోయిన టర్కీకి భారత్ సాయం ప్రకటించింది. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇక ఇలాంటి భూకంప దుర్ఘటనలు టర్కీలో ఎన్నో చోటుచేసుకున్నాయి. 1999లో వచ్చిన ఓ భారీ భూకంపం వల్ల 17వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇస్తాంబుల్ నగరంలోనే వెయ్యి మందికిపైగా ప్రజలు మృతిచెందారు.
aerial images from #Turkey post the massive #Earthquake today
Just heartbreaking pic.twitter.com/WQBbwnLBF8
— Abier (@abierkhatib) February 6, 2023
#earthquake #Turkiye #TurkeyEarthquake
Turkey and Syria: second large earthquake strikes as death toll rises to over 1,500 pic.twitter.com/u8Bp9HmuL4— gio putkaradze (@gioputkaradze) February 6, 2023
#BREAKING: Another large building has collapsed in Turkey – a total of more than 3 thousand are believed to have been destroyed
Second earthquake hit just moments ago @6NewsAU pic.twitter.com/Q2kDerZf7n
— Leonardo Puglisi (@Leo_Puglisi6) February 6, 2023