‘ప్రేమ’ అనే రెండు అక్షరాల పదం.. ఎన్నో సంచలనాలను సృష్టిస్తుందనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ ప్రేమకు రంగు, కులం, మతం, ప్రాంతం అనే బేధాలు ఏమి ఉండవు. అలా ఎల్లలు దాటి ప్రేమించుకున్నవారు ఎందరో ఉన్నారు. అయితే కొన్ని ప్రేమలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటాయి. మనవరాలి వయస్సు ఉన్న అమ్మాయితో కొందరు ప్రేమలో పడతారు. అలానే తాత వయస్సు ఉన్న వృద్ధులతో కొందరు యువతులు ప్రేమలో పడతారు. అంతేకాక ఏకంగా పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇస్తుంటారు. తాజాగా అలాంటి షాక్ ఇచ్చారు అమెరికాకు చెందిన ఓ జంట. 24 ఏళ్ల యువతి తన తాత కంటే పెద్దవాడైనా 85 వృద్ధుడిని పెళ్లి చేసుకుంది. ‘నీ ప్రేమ తగలేయ్యా’ అంటూ ఆ యువతిపై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని మిస్సిస్సిప్పిలోని స్టార్క్‌విల్లే అనే ప్రాంతంలో 24 ఏళ్ల నైజీరియన్ యువతి మిరాక్లే తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె 2019లో లాండరెట్ లో నర్సుగా పనిచేస్తున్నప్పుడు చార్లెస్ పోగ్ (85)ని అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ పనిచేసిన చార్లెస్ పోగ్ రిటైర్డ్ అయి ఖాళీగా ఉంటున్నారు. స్నేహంగా సమయంలో ఆ యువతిపై చార్లెస్ అభిమానం పెంచుకున్నాడు. ఆమె ప్రవర్తన, ఎదుటి వారితో మాట్లాడే విధానం ఆయనకు బాగా నచ్చింది. అలా ఆమెతో పాటు ఓ సంవత్సరం పాటు స్నేహ భావంతో ప్రయాణం చేశాడు.
చివరకు తన ప్రేమను ఆమెకు తెలియజేయాలని భావించాడు. ఈక్రమంలో ఇటీవలే ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆమెకు కూడా ఆయన ప్రేమను అంగీకరించింది. ఈ క్రమంలో ఆ 24 ఏళ్ల యువతి 85 వృద్ధుడిని పెళ్లి చేసుకుని భర్తగా పొందింది. ఈ సందర్భంగా మిరాక్లే మాట్లాడుతూ.. చార్లెస్ తో పెళ్లికి ఆమె తల్లి తమికా ఫిలిప్స్( 45), తాత జో బ్రౌన్(72)లు మొదటి నుండి మద్దతుగా ఉన్నారని ఆమె చెప్పారు, కానీ తన తండ్రి కరీమ్ ఫిలిప్స్(47)ను ఒప్పించడం కాస్తా కష్టం అయిందని ఆమె తెలిపారు. చార్లెస్ కేవలం తన నుంచి సేవలు మాత్రమే కోరుకున్నాడని మిరాక్లే అన్నారు. తమ పెళ్లి కొందరికి వింతగా అనిపించి ఉండవచ్చు.. కానీ మాకు మాత్రం వింతగా అనిపించలేదు.
అంతేకాక ఎంతో సంతోషంగా ఉందని, అతడితో తన కొత్త జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని ఆమె తెలిపారు. అయితే తాను ప్రేమించే సమయానికి అతడి వయస్సు తెలియదని, తెలిసేరికి అతడి ప్రేమలో మునిగిపోయానని మిరాక్లే తెలిపింది. అతనికి 100 లేదా 55 ఏళ్లు అని విషయాన్ని తాను పట్టించుకోనని అతను ఎప్పుడూ లేచి చురుకుగా ఉంటాడని ఆ యువతి తెలిపింది. 61 ఏళ్ల అంతరం ఉన్న ఈ జంట ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారంట. మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనప్పుడు.. వయస్సు బేధం చూడకూడదని ఆమె.. తన అభిప్రాయాన్ని తెలిపింది. వీరి ప్రేమకథను తెలుసుకున్న నెటిజన్లు వీరి నిర్ణయాన్ని సమర్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.