ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా.. ఎన్ని సార్లు చెప్పుకున్నా కొంత మిగిలే ఉంటుంది. ప్రేమ మాటలకు అందని అనుభూతే కాదు.. మనల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరిచే వింతైన విషయం కూడా. ఇది కొన్ని ప్రేమ కథలను చూస్తే అర్థం అయిపోతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రేమ పెళ్లిళ్లు సామాన్య జనాన్ని షాక్‌కు గురిచేస్తున్నాయి. అందమైన యువతి పని మనిషితో ప్రేమలో పడటం.. ఓ డాక్టర్ అమ్మాయి ప్యూన్‌తో ప్రేమలో పడటం.. డ్రైవింగ్ నేర్పించటానికి వచ్చిన వ్యక్తితో కారు యజమాని ప్రేమలో పడటం ఇవన్నీ జనాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే సంఘటనలు. ఇవన్నీ కూడా పాకిస్తాన్‌లో జరిగాయి.
తాజాగా, మరో ప్రేమ కథ ప్రపంచం ముందుకు వచ్చింది. ఈ ప్రేమ కథ కూడా అందరినీ నోరెళ్లబెట్టిస్తోంది. ఈ ప్రేమ కథలో 24 యువతి, 50 ఏళ్ల అంకుల్‌తో ప్రేమలో పడింది. అతడ్ని ప్రేమపెళ్లి చేసుకుంది. తర్వాత అదే బస్‌లో కండెక్టర్‌గా భర్తతో పాటే జీవితాన్ని ముందుకు సాగిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని పంజాబ్‌కు చెందిన షెహ్‌జాదీ అనే 24 ఏళ్ల యువతి కొంత కాలం క్రితం కాలేజ్‌లో చదువుతూ ఉండేది. తరచుగా చన్ను నుంచి లాహోర్ వరకు బస్సులో ప్రయాణం చేసేది. సాదిఖీ అనే 50 ఏళ్ల వ్యక్తి ఆమె ప్రయాణించే బస్‌ను నడిపేవాడు. షెహ్‌జాదీ లాస్ట్ స్టాప్‌లో దిగాల్సి ఉండటంతో సాదిఖీతో మాట్లాడుతూ ఉండేది. రోజులు గడుస్తున్న కొద్ది ఆమెకు అతడిపై ప్రేమ పుట్టింది.
ముఖ్యంగా అతడు బస్‌ను నడిపే విధానం ఆమెను ఆకర్షించింది. ఓ రోజు తన ప్రేమ విషయాన్ని అతడికి చెప్పింది. అతడికి కూడా ఆమె అంటే ఇష్టం ఉండటంతో ప్రేమను అంగీకరించాడు. అయితే, వీరి పెళ్లికి యువతి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. అయినా కూడా వారందరినీ కాదని ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం షెహ్‌జాదీ సాదిఖీ బస్‌లోనే కండెక్టర్‌గా పనిచేస్తోంది. వీరిని ప్రముఖ పాకిస్తానీ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయటంతో వీరి ప్రేమ కథ ప్రపంచానికి తెలిసింది. ఈ జంటను చూస్తున్న నెటిజన్లనుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మరి, 50 ఏళ్ల బస్ డ్రైవర్‌తో 24 ఏళ్ల యువతి ప్రేమ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.