ప్రేమ.. ఈ రెండు అక్షరాలు ఇద్దరు మనుషులతో పాటు వారి మనసులను ఒక్కటి చేస్తుంది. చివరికి మూడు ముళ్ల బంధం వరకు తీసుకెళ్తుంది. ఇక ప్రేమకు వయసుతో సంబంధం లేదని అందరూ అంటుంటారు. దీంతో పాటు కులం, మతం, ప్రాంతం, రంగు అనే బేదాభిప్రాయాలు లేకుండా నేటి కాలంలో యువత ప్రేమలో మునిగితేలుతున్నారు.
ఇక మరో విషయం ఏంటంటే? 18 ఎళ్ల యువతితో ప్రేమలో పడ్డ 21 ఏళ్ల యువకుడు… ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ఇకపోతే అదే 76 ఏళ్ల బామ్మతో 19 ఏళ్ల టీనేజర్ ప్రేమలో పడితే ఈ వార్త ఆశ్చర్యంతో పాటు అందరినీ అవాక్యయ్యేలా చేస్తుంది.కానీ ఇటాలియన్ దేశంలో ఇదే జరిగింది. 76 ఏళ్ల బామ్మపై 19 ఏళ్ల గియుసెప్ అనే టీనేజర్ మనసు పారేసుకున్నాడు. వీరి మధ్య ఏజ్ గ్యాప్.. 57 ఏళ్లు ఉన్నా ప్రేమకు ఇది అడ్డుకాదని నిరూపించారు.
ఇది కూడా చదవండి: Odisha: పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.. ఒప్పుకోలేదని చెట్టుకు ఉరేసుకున్నారు!
ఇక ఇద్దరు ఒక్కటవ్వాలని భావించి ఇటీవల ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్ మెంట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో పాటు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటాలియన్ దేశానికి చెందిన గియుసెప్ అనే 19 ఏళ్ల టీనేజర్, 76 ఏళ్ల మహిళతో పరిచయం పెంచుకున్నాడు. వారిద్దరి పరిచయం చివరికి ప్రేమగా రూపుదాల్చింది. కొన్నాళ్లకి వీరిద్దరి మనసులు కలవడంతో అభిప్రాయాలు పంచుకున్నారు.
ఇక ఒకరినొకరు జీవితాంతం కలిసి ఉండాలనుకుని ఈనెల 24 న ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఈ సందర్భంగా, బాలుడు.. మహిళకు డైమండ్ రింగ్ కూడా తొడిగాడు. ఆ తర్వాత.. ఆమెకు బెలూన్ ఇచ్చి ఆమె నుదిటిపై కిస్ కూడా ఇచ్చాడు. లేటు వయసులో ఘాటు ప్రేమ అన్నట్లు వీరి ప్రేమపై నెటిజన్లు వినూత్న రీతిలో స్పందిస్తున్నారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపించిన ఈ జంటపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.