18 వేల ఏళ్ల నాటి మిస్టరీ వీడింది. 2019లో సైబీరియాలోని మంచులో దొరికిన ఆ జంతువు ఏంటో శాస్త్ర వేత్తలు కనిపెట్టారు. అది ఇన్ని రోజులుగా అనుకుంటున్నట్లుగా కుక్క కాదని తేలింది.
2019లో సైబీరియాలోని మంచు గడ్డల్లో శాస్త్రవేత్తలకు ఓ జంతువు కళేబరం దొరికిన సంగతి తెలిసిందే. దానిపై పరిశోధనలు చేసిన లవ్ డేలన్, డేవ్ స్టాంటన్ శాస్త్రవేత్తల ద్వయం అది కుక్క లేక తోడేలా అన్నది కనుక్కోలేకపోయారు. కార్చన్‌డేటింగ్ పరీక్షల్లో అది 18 వేల ఏళ్ల నాటి దని తెలిసి ఆశ్చర్యపోయారు. వేల ఏళ్లు గడుస్తున్నా ఆ జంతువు ఇంకా భద్రంగా ఉంది. దాని పళ్లు, ఇతర శరీర అవయవాలు అన్నీ అలానే ఉన్నాయి. దానికి వారు ‘డోగర్’ అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తలకు ఇన్ని రోజులు అర్థం కాకుండా మిగిలిపోయిన ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికింది. 18 వేల ఏళ్ల నాటి మిస్టరీ వీడింది.
పరిశోధకుల నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలం దొరికింది. సైబేరియా మంచు గడ్డల్లో దొరికిన ఆ జంతువు ఏంటో తెలిసిపోయింది. డోగర్‌గా పిలవబడుతున్న ఆ జంతువు కుక్క కాదట. అది ఓ తోడేలని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఆ తోడేలుకు అప్పటి కుక్కలతో కొద్దిగా కూడా దగ్గరి సంబంధం లేదని తేల్చారు. అది కుక్కా లేకా తోడేలా అని కనుక్కోవటానికి 72 కుక్కలు, 72 తోడేళ్ల జీన్స్‌పై పరిశోధనలు చేశారు. ఈ సమయంలోనే అది కుక్క కాదని, తోడేలు జాతికి చెందిందని తేలింది. పురాతన జీన్స్‌పై పరిశోధనలు చేస్తున్న లండన్‌కు చెందిన ప్రముఖ పరిశోధకుడు ఆండర్స్ బెర్గమ్‌స్టార్మ్ మాట్లాడుతూ..
‘‘మనుషులు కుక్కలను ఐస్ ఏజ్ కాలంలోనే మచ్చిక చేసుకున్నారని అందరికీ తెలుసు. అయితే, వాళ్లు కుక్కలను మాత్రమే మచ్చిక చేసుకున్నారా? లేక వేరే వాటిని కూడా మచ్చిక చేసుకున్నారా? అన్నది ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. మనుషులు జంతువుల్ని మచ్చిక చేసుకోవటం ఎక్కడ మొదలైందో కూడా అర్థం కాని విషయమే. ఇది కేవలం ఒకసారి జరిగిందా చాలా సార్లు జరిగిందా అని కూడా ప్రశ్నార్థకమే’’ అని చెప్పారు. మరి, వీడిన 18 వేల ఏళ్ల నాటి మిస్టరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.