గ్రీన్ ల్యాండ్ ఈ దేశం పేరు మీరు పెద్దగా విని ఉండకపోవచ్చు. గ్రీన్ ల్యాండ్ ప్రపంచ పటంలో యూరప్ కి, ఉత్తర అమెరికాకి మధ్యలో వుంటుంది! భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగమే. అయినా గ్రీన్ ల్యాండ్ రాజకీయంగా ఐరోపా ఖండంతో వందల సంవత్సరాలుగా కలిసి వుంటోంది. ప్రపంచపు అతి పెద్ద ద్వీపమైన గ్రీన్ ల్యాండ్ లో చాలా తక్కువ సంఖ్యలో జనం, విపరీతంగా మంచు ఉంటుంది! అయితే, మనకు తెలియని ఈ మార్మికమైన మంచులోకంలో బోలెడు వింతలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1) గ్రీన్ ల్యాండ్ అంటేనే ఐస్! ఎక్కడ చూసినా పొరలు పొరలుగా తెరలు తెరలుగా మంచే కనిపిస్తుంది. అందుకే.. ఇక్కడ ప్రతీ సంవత్సరం మార్చ్ నెలలో ప్రపంచ ఐస్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్స్ జరుగుతాయి! గ్రీన్ ల్యాండ్ లోని ఉమ్ నాక్ అనే నగరంలో ఈ పోటీలు జరుగుతాయి. ప్రపంచంలోని ఎందరో గోల్ఫ్ క్రీడాకారులు ఇక్కడికి చేరుకుంటారు!
2) ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ గ్రీన్ ల్యాండ్ విశేషం అసలు నమ్మలేనిది! అసలు అలా కూడా జరుగుతుందా అనుకుంటారు మీరు! ఎందుకంటే, గ్రీన్ ల్యాండ్ లో మే నెల మధ్య కాలం నుంచీ జూలై మధ్య వరకూ… సూర్యుడు అస్తమించడు! రోజంతా భానుడు ధగధగలాడుతూ కనిపిస్తూనే వుంటాడు. రాత్రి అయిన కొద్దీ… కొద్దిగా వెలుతురు తగ్గుతుంది తప్ప … సంవత్సరంలో మూడు నెలల పాటూ రోజంతా సూర్యుడి దర్శనం జరుగుతూనే వుంటుంది! ఇలాంటి అద్భతం గ్రీన్ ల్యాండ్లో తప్ప మరెక్కడా చూడలేం!
3)గ్రీన్ ల్యాండ్ అనే పేరు కూడా ఈ ప్రాంతంలాగా విచిత్రమే. గ్రీన్ ల్యాండ్ అంటే అర్థం…. జనం యొక్క స్థానం అని! కానీ, గ్రీన్ ల్యాండ్ లో అసలు జనం వుండేదే చాలా తక్కువ. కేవలం 57వేల మంది వుంటారని అంచన. వాళ్లు కూడా రాజధాని చుట్టుపక్కలే వుంటారు. దాదాపు గ్రీన్ ల్యాండ్లోని 80శాతం భూమి నిర్మానుష్యం, మంచుమయం!
4) ఇక గ్రీన్ ల్యాండ్లో సంవత్సరం పొడవునా రాత్రి పూట ఆకాశంకేసి చూస్తే కళ్లు మిరిమిట్లు గొలుపుతాయి. ఎందుకంటే, ఆకాశం మబ్బులు పట్టకుండా వుంటే… ఇక్కడ గగనం నిండా వేలాది మెరుపులు నాట్యం చేస్తూ కనిపిస్తాయి! అదీ రంగురంగుల్లో! జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అద్భుత దృశ్యం ఇది!
5) గ్రీన్ ల్యాండ్లో ప్రకృతి ఎంత అందంగా వుంటుందో అంతే భయంకరంగా కూడా వుంటుంది. మొత్తం సంవత్సరంలో కేవలం జూలై నెలలో మాత్రమే ఉష్ణోగ్రత సున్నా కంటే ఎక్కువ వుంటుంది. మిగతా పదకొండు నెలలు గడ్డ కట్టే చలి ఊపిరాడనివ్వదు. కాబట్టి బయటి నుంచి వెళ్లే పర్యాటకులు జూలైలో మాత్రమే వెళుతుంటారు.
6) ఇప్పటికీ గ్రీన్ ల్యాండ్లో రోడ్డు మార్గాలు వుండకపోవటం మరో ఆశ్చర్యకర విషయం! ఇక్కడ వుండే ఒక్కో ప్రాంతం నుంచీ మరో ప్రాంతానికి వెళ్లటం పడవల ద్వారానే! గ్రీన్ ల్యాండ్ వాతావరణం రోడ్లు వేయటానికి అనుకూలం కాదు. అక్కడి మంచులో రోడ్లు కొట్టుకుపోతాయి.
7) ఈ అజ్ఞాత మంచులోకాన్ని పదో శతాబ్దంలో వికింగ్స్ అనే యూరోపియన్ సముద్ర అన్వేషకులు కనుగొన్నారు. వాళ్లు చేసిన సముద్ర యాత్రల్లో భాగంగా దీన్ని గుర్తించారు!
8) నాలుగు వేల సంవత్సరాల పూర్వం నుంచీ మనుషులు గ్రీన్ ల్యాండ్ పై నివశిస్తునే ఉన్నా.., ఇక్కడి భూగోళిక పరిస్థితిలు జనం నివసించాడనికి ఏ మాత్రం ఆమోద యోగ్యంగా మారలేదు.
9) గ్రీన్ ల్యాండ్లో నివశించే ప్రజలకి అసలు ఫ్రిడ్జ్ అంటే ఏమిటో తెలియదు. గ్లాస్ లో నీరు నోటిలో పోసుకునే లోపే గడ్డ కట్టేసే పరిస్థితిలు ఉంటాయి అక్కడ. కాబట్టి.. గ్రీన్ ల్యాండ్ ప్రజలకి.. ఏసీలు, కూలర్ లు , ఫ్రిడ్జ్ లు వంటి వాటితో పెద్దగా పని ఉండదు.
10) ప్రపంచం మొత్తానికి లాక్ డౌన్ అనే మాట ఇప్పుడు మాత్రమే తెలుసు. కానీ గ్రీన్ ల్యాండ్ దేశస్థులు వందల సంవత్సరాల నుండి అవసరమైఅప్పుడు లాక్ డౌన్ పాటిస్తూనే వస్తున్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితిలు ఒక్కోసారి మానవాళికి ముప్పుగా కూడా మారుతాయి. అలాంటి సందర్భంలో ప్రభుత్వం ఇక్కడ లాక్ డౌన్ విధించడం పరిపాటిగా వస్తోంది.