ఫిల్మ్ డెస్క్- సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి.. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆ ఎక్స్ పెక్టేషన్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన 28వ సినిమాను చేస్తున్నారు. ఈ మూవీ తరువాత డైరెక్టర్ రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది.
దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో ఓ ఆసక్తికరమైన విషయంపై ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది. మహేష్ బాబుతో తీయబోయే సినిమాను రాజమౌళి మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.కథలో భాగంగా ఈ మూవీలో చాలా కీలకమైన పాత్ర ఒకటి ఉంటుందట. సుమారు నలబై నిమిషాల పాటు ఆ పాత్ర సినిమాలో కనిపిస్తుందని తెలుస్తోంది. అలాంటి పాత్రను ఓ పెద్ద హీరోతో చేయించాలని రాజమౌళి నిర్ణయించారని సమాచారం. రాజమౌళి అనుకోవాలేగాని బాలీవుడ్ హీరోలు సైతం ఆయన సినిమాలో నటించడానికి వెనుకాడరని అందరికి తెలుసు. ఇంతకీ రాజమౌళి తన సినిమాలో ఈ కీలక పాత్రకు మన టాలీవుడ్‌లో అగ్ర హీరోను తీసుకుంటారా, లేక బాలీవుడ్ నుంచి హీరోను తీసుకుంటారా అన్నదే ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా విడుదల చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో మహేష్ బాబు సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ సినిమాను వెనువెంటనే పూర్తి చేసి, రాజమౌళి సినిమా స్టార్ట్ చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నారట. అన్నట్లు మహేష్, రాజమౌళి కాంబినేషన్ సినిమాను ప్రముఖ నిర్మాత దుర్గారావు నిర్మించబోతున్నారు.