తన గాత్రంతో అశేష ప్రేక్షకులను అలరించి.. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ గాయని, భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ మృతి చెందారు. పాట కోసం తన జీవితాన్నే అంకితం చేశారు. తుది శ్వాస విడిచేవరకు ఆమె పాటే ప్రాణంగా బతికారు. సినిమాలతో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె జీవితంలో పలు ఆసక్తికర అంశాలు మీకోసం..
లతా మంగేష్కర్ అసలు పేరు హేమ. ఇండోర్ లో జన్మించారు. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ గాయకుడే కాక నాటకాల్లో నటించేవాడు. అలా ఓ సారి లతా మంగేష్కర్ తండ్రి రాసిన నాటకంలో ఓ పాత్ర పోషించారు. ఆ పాత్ర పేరు లతిక. అలా ఆ పేరే ఆమెకు లతా మంగేష్కర్ గా స్థిరపడిపోయింది.లతా మంగేష్కర్ జీవితంలో బడికి వెళ్లింది ఒక్క రోజు మాత్రమే. పాఠశాలలో ఆమె తోటి విద్యార్థులకు పాటలు నేర్పుతుందని తెలుసుకున్న టీచర్లు ఆమెను స్కూల్ కి రావద్దని చెప్పేశారు. అదే లత జీవితంలో పాఠశాలకు వెళ్లిన మొదటి, చివరి రోజు.
తండ్రి మరణానంతరం కుటుంబ పోషణ కోసం లతా మంగేష్కర్ సినిమాల్లో కూడా నటించారు. నటిగా, గాయనిగా రాణించారు.1953లో లతకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫ్మిల్‌ఫేర్ అవార్డు వచ్చింది. కానీ ఆమె తిరస్కరించారు. కారణం ఏంటో చెబితే.. సరిదిద్దుకుంటామని న్యాయనిర్ణేతలు అడిగారు. అందుకు లత.. వస్త్రాలు లేని ఓ నగ్న స్త్రీ ప్రతిమను.. ఒక సంప్రదాయ భారత మహిళగా అందుకోలేను అని తెలిపారట. దాంతో న్యాయ నిర్ణేతలు.. కర్చీఫ్‌లో చుట్టి అవార్డును అందివ్వగా అప్పుడు తీసుకున్నారట.
1962లో చైనా యుద్ధంలో ఓడిన జవానులను ఓదార్చుతూ.. లతా మంగేష్కర్ పాటిన పాట విని.. కంట తడి పెట్టానని.. అప్పటి ప్రధాని నెహ్రూ ఆమెతో స్వయంగా చెప్పడం విశేషం.రాజ్యసభ ఎంపీగా ఉన్నకాలంలో లతా మంగేష్కర్ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు. జీతం తీసుకోని ఏకైక ఎంపీగా నిలిచారు.
పాటలంటే లతకు ఎంతటి భక్తి భావం అంటే.. పాట పాడే సమయంలో ఆమె చెప్పులు ధరించరు.
ఇది కూడా చదవండి : లతా మంగేష్కర్ పై హత్యాయత్నం..