స్మార్ట్ ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, కొనాలి అంటేనే కాస్త ఆలోచించాలి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ అంటే అంత తేలిగ్గా దొరకదు కద. కనీసం 15 నుంటి రూ.20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటిది 9 వేలకే స్మార్ట్ ఫోన్ వస్తే? అందులో అదిరిపోయే ఫీచర్లు ఉంటే? అవును బడ్జెట్ రేంజ్ లో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ మీకోసం తీసుకొచ్చాం.
స్మార్ట్ ఫోన్ అంటే ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరేమో? ఎందుకంటే వాటి వాడకం ఆ రేంజ్ లో పెరిగిపోయింది. ఇప్పుడు నెలల పిల్లల నుంచే ఫోన్ వాడేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ మన శరీరంలో ఒక భాగం అయిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు. అంతగా వాడుతున్నారు కాబట్టే స్మార్ట్ ఫోన్స్ తయారీ కూడా బాగా పెరిగిపోయింది. కనీసం వారానికి 4 కొత్త మోడల్స్ మార్కెట్ లో విడుదల అవుతున్నాయి. కొన్ని ప్రీమియం ఫోన్లు ఉంటునప్పటికీ ఇప్పుడు చెప్పుకోబోయే లాంటి బడ్జెట్ ఫోన్లు కూడా ఉంటున్నాయి. ఇప్పుడు మీకొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గురించి చెప్పబోతున్నాం. బడ్జెట్ అన్నామని తక్కువగా చూడకండి. ఫీచర్స్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది.
స్మార్ట్ ఫోన్లలో మొన్నీ మధ్య నుంచి ఇన్ఫినిక్స్ బ్రాండ్ బాగా వినిపిస్తోంది. ఎందుకంటే బడ్జెట్ రేంజ్ లో అద్భుతమైన ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లలను విడుదల చేస్తున్నారు. అది కూడా మంచి స్టైలిష్ లుక్స్, డిజైన్ తో ఈ ఫోన్లు ఉండటం విశేషం. ఈ కంపెనీ నుంచి తాజాగా ఇన్ఫినిక్స్ హాట్ 30i అనే మోడల్ మార్కెట్ లోకి విడుదల అయ్యింది. డిజైన్ పరంగా క్రిటిక్స్ నుంచి కూడా ఈ మోడల్ కి మంచి మార్క్స్ పడ్డాయి. ఇంక ధర మాత్రం చాలా తక్కువగా కేవలం రూ.8,999కే అందిస్తున్నారు. ఈ ఫోన్ లో గ్లేసియర్ బ్లూ, మిర్రర్ బ్లాక్ కలర్ వేరియంట్లతో వస్తోంది. 8 జీబీ ర్యామ్+ 128 జీబీ రోమ్ వేరియంట్ లో మాత్రమే ఈ ఫోన్ ని రిలీజ్ చేశారు.
ఇంక ఈ ఇన్ఫినిక్స్ హాట్ 30i ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.6 ఇంచెస్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తోంది. 50 ఎంపీ ఏఐ లెన్స్ కెమెరా ఉంది. 5 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా వస్తోంది. దీనిలో జీ37 హీలియో ప్రాసెసర్ ఉంది. ఈ ధరలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇందులలో అదనంగా 8 జీబీ ర్యామ్ వాడుకునే వర్చుల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మీరు ఈ ఫోన్ లో 16జీబీ ర్యామ్ ని పొందే అవకాశం ఉంది. ఈ ప్రైస్ లో ఇన్ని ఫీచర్స్ తో వచ్చిన ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ గురించే ఇప్పుడు టెక్ రంగంలో చర్చ జరుగుతోంది. ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ఈ ఇన్ఫినిక్స్ హాట్ 30i స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.
Infinix Hot 30i launched in India for a launch price of ₹8,999.
8GB RAM (plus 8GB virtual RAM)
Helio G37
6.6-inch HD+ 90Hz
5,000mAh/10W
Side-mounted fingerprint scanner
50MP main camera#Infinix #infinixhot30i pic.twitter.com/eaQGFQU0mx— Mukul Sharma (@stufflistings) March 27, 2023