విమానయాన కంపెనీ ఇండిగో ప్రయాణికుల కోసం ఒక అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్న టికెట్లపై 10 శాతం తగ్గింపు ఆఫర్ చేస్తోంది. బేస్ ఫేర్‌కు ఇది వర్తిస్తుంది. జూన్ 23 నుంచి అంటే ఈరోజు నుంచే ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఇండిగో టికెట్ బేస్ ఫేర్‌లో 10 శాతం సొంతం చేసుకోవచ్చు. నేషనల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో తమ వంతు భాగస్వామ్యం అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో తెలిపింది.
18 ఏళ్లు లేదా ఆపైన వయసు కలిగిన వారు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే టికెట్ ధరలపై తగ్గింపు సొంతం చేసుకోవచ్చని వివరించింది. ఇండిగో వెబ్‌సైట్‌లో ఆఫర్ వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ పరిమిత సీట్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. అందువల్ల సీట్లు ఉన్నంత వరకే ఆఫర్ పొందగలరని వివరించింది. ముఖ్య గమనిక – ఇతర ఆఫర్లతో కలిపి ఈ ఆఫర్ పొందటం వీలు కాదు.