హైదరాబాద్- కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి ఇంకా కాసేపు మాత్రమే సమయం ఉంది. 2021 సంవత్సరానికి గుడ్ బై చెప్పి, 2022 సంవత్సరానికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు అంతా సిద్దమయ్యారు. ఐతే ఎప్పటిలీ న్యూ ఇయర్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకప కరోనా ఒమిక్రాన్ అడ్డువస్తోంది. అవును రోజు రోజుకు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల నేపధ్యంలో కొత్త సంవత్సర వేడుకల్లో కఠినమైన అంక్షలును విధించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఐతే న్యూ ఇయర్ వస్తోందంటే ఎంతో కొంత ఉత్సాహం ఉంటుంది కదా. అదే క్రమంలో నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించేందుకు తెలంగాణ ప్రజలు రెడీ అయ్యారు. హైకోర్టు సూచనలతో తెలంగాణ సర్కార్ ఎన్ని ఆంక్షలు విధించినా న్యూ ఇయర్ సందర్బంగా అర్ధరాత్రి వరకు హల్‌చల్ చేసేందుకు మందుబాబులు తమ ఏర్పాటు చేస్తుకుంటున్నారు.
ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో తాము విధించిన నిబంధనలను తప్పకుండా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యువతను జాగ్రత్తగా ఉండాలని సూచించారు తెలంగాణ పోలీసులు. కేసీఆర్ ప్రభుత్వం వైన్ షాపులకు అర్ధరాత్రి వరకు అనుమతి ఇచ్చిందని కదా అని పీలకదాకా తాగి రోడ్లపై హల్ చల్ చేస్తామంటే మాత్రం జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తామని పోలీసులు హెచ్చరించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మద్యం సేవించి పట్టుబడితే 10వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడుతుందని పోలీసులు గుర్తు చేశారు.
మధ్యం కాగి రెండోసారి పట్టుబడితే 15 వేలు ఫైన్ లేదా రెండేళ్ల జైలుశిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చెప్పారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్ లోని అన్ని ఫ్లై ఓవర్లు మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్యాబ్, ఆటో డ్రైవర్లకు యూనిఫాంతో పాటు వాహన డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలని హెచ్చరించారు. అందుకని కొత్త సంవత్సర వేడుకల నేపధ్యంలో మధ్యం తాగేవారు కాత్స జాగ్రత్తగా ఉండాలని వేరే చెప్పక్కర్లేదు.