ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఎయిర్ పోర్ట్ మొత్తం తనిఖీలు చేపట్టినా బాంబు దొరలేదు దీంతో ఫేక్ కాల్ గా నిర్దారించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయంలో ఇప్పటి వరకు ఎలాంటి బాంబును, అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని అధికారులు తెలిపారు. అయితే చివరకు విమానంలో బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అనంతరం విచారణ చేపట్టి ఆకాష్ దీప్ అనే వ్యక్తి కాల్ చేసినట్లుగా గుర్తించారు. అతడు ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి పాట్నా వెళ్తున్న విమానంలో తండ్రితోపాటు ఎక్కాడు. ఆకాష్ దీప్ ను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న సుమారు 52 మంది ప్రయాణికులను మరో విమానానికి తరలించి విస్తృత తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. కాగా బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని ఆకాష్ దీప్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
అయితే తన కొడుకు మానసిక స్థితి స్థిరంగా లేదని, అతడు విమానంలో కూర్చున్నప్పుడు తన ఫోన్ నుంచి కాల్ చేశాడని ఆకాష్ దీప్ తండ్రి పోలీసులకు చెప్పినట్లు డీసీపీ తెలిపారు. చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకాష్ దీప్ మానసిక స్థితి సరిగా ఉందా లేదా అనేది వైద్యపరీక్షల్లో తేల్చనున్నారు.