ఫన్ బకెట్ భార్గవ్.. ఒకప్పుడు సోషల్ మీడియా సెలబ్రెటీగా ఒక వెలుగు వెలిగిన కుర్రాడు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ పట్టినా ఇతని వీడియోలే వైరల్ అవుతూ వచ్చాయి. కానీ.., భార్గవ్ కొన్ని రోజుల క్రితం మైనర్ బాలికని లొంగతీసుకుని, ఆమెని గర్భవతిని చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్ట్ లో ఉంది. అయితే.., కొన్ని రోజుల క్రితమే భార్గవ్ బయటకి వచ్చి.., తనకి ప్రేక్షకుల మద్దతు కావాలంటూ ఓ పోస్ట్ కూడా చేశాడు. కాగా.., భార్గవ్ ఇప్పుడు తన పరిస్థితిని వివరిస్తూ.. ఏకంగా 20 నిమిషాల వీడియోని విడుదల చేశాడు. “ఇది నా కథ” పేరిట ఈ వీడియో రిలీజ్ అయ్యింది.
కెమెరా ముందుకి వచ్చిన ప్రతిసారి కాస్త జోష్ గా, కాస్త గర్వంగా మాట్లాడే ఫన్ బకెట్ భార్గవ్ ఈ వీడియోలో మాత్రం కాస్త ఎమోషనల్ అయ్యాడు. అందరిని నమ్మి మోసపోయాను అని, తన మీద నడుస్తున్న ప్రచారం అంతా నిజం కాదని, ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది కాబట్టి.. ఇంతకు మించి ఆ విషయంలో స్పందించలేని చెప్పాడు భార్గవ్. నెలకి రూ.8 లక్షల సంపాదిస్తూ కూడా తాను డబ్బులు దాచుకోలేకపోయాను అని భార్గవ్ బాధపడ్డాడు. కానీ.., ఇప్పుడు తాను బయటకి వచ్చే సరికి నా జాబ్స్ అన్నీ పోయాయని ఎమోషనల్ అయ్యాడు.
ఇక తాను జైలులో ఉన్న సమయంలో తాను నమ్మిన వ్యక్తులే తన అకౌంట్ నుండి 12 లక్షలు డ్రా చేసేశారని, వాళ్ళని కూడా క్షమించి వదిలేశానని భార్గవ్ చెప్పుకొచ్చాడు. కానీ.., ఈ క్లిష్ట సమయంలో తన పక్కన ఎవ్వరూ లేరని, ఇప్పుడు తాను మళ్ళీ మొదటి నుండి కొత్త జీవితం మొదలు పెడుతున్నట్టు భార్గవ్ చెప్పుకొచ్చాడు.
ఈ ప్రయాణంలో తనని ప్రోత్సహించండి అని, నెగిటివ్ గా మాత్రం కామెంట్స్ చేయకండి అంటూ భార్గవ్ కన్నీరు పెట్టుకున్నాడు. అయితే.., ఇంత చెప్పిన భార్గవ్ తనపై వచ్చిన ఆరోపణల విషయంలో గాని, ఆ కేసుల విషయంలో గాని ఎలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మరి.. ఈ విషయంలో భార్గవ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.