మంచి మనసు ఉంటే.. సమాజంలో చిన్న, పెద్ద అనే అంతరాలు ఉండవు. మనుషులంతా ఒక్కటే. ఇప్పుడు ఇదే విషయాన్ని రుజువు చేశాడు ఓ ఐఏఎస్ అధికారి. తాను అంత పెద్ద అధికారి అయ్యుండి కూడా మార్కెట్ లో కూరగాయలు అమ్మాడు! ఒక ఐఏఎస్ అధికారికి అంతటి అవసరం ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకు కూరగాయలు అమ్మాడు? ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా.. యూపీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. ఆయన కింద క్యాడర్ లో కొన్ని వందల మంది ఉద్యోగులు పని చేస్తారు. అంతటి రేంజ్ ఆయనది. కానీ.., ఆయన మాత్రం మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు కూడా ఈ పిక్ చూసి షాక్ అయ్యారు. దీంతో.. ఈ పిక్ గురించి ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
“ఆ ఫోటోలో ఉన్నది నేనే. నేను కూరగాయలు అమ్మిన మాట వాస్తవమే. నేను అప్పట్లో ప్రయాగ్‌రాజ్ వెళ్లాను. తిరిగి వచ్చే సమయంలో కూరగాయల మార్కెట్ వద్ద ఆగాను.కానీ.., అంతలో అక్కడ కూరగాయలు అమ్మే ఓ మహిళ కంగారు పడుతూ కనిపించింది. నేను విషయం ఏమిటని అడగ్గా.. “తన బాబు మార్కెట్ లోనే ఏదో షాప్ లోకి వెళ్ళాడు అని, వాడిని వెతికి తీసుకుని రావాలని, కాసేపు కొట్టు దగ్గర ఉండరా, నేను బాబుని తీసుకుని రావాలని చెప్పి వెళ్లిపోయింది”. నేను కూడా పరిస్థితిని అర్ధం చేసుకుని కొట్టుని చూస్తూ ఉండిపోయా. అదే సమయంలో కొంత మంది కస్టమర్స్ కూరగాయల కోసం వస్తే.., వారికి ఆ కూరగాయలు అమ్మాను. ఇంతలో నా సిబ్బంది ఆ ఫోటోలు తీశారు” అని ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా పోస్ట్ లో తెలియచేశారు. ఐఏఎస్ అధికారి కూరగాయలు అమ్మడం వెనకున్న అసలు కథ ఇది. ఓ తల్లిని బిడ్డని వెతుక్కోవడం కోసం వెళ్తే.., తన స్థాయిని, రేంజ్ ని అన్నిటిని మర్చిపోయి, ఆ అమ్మకి సహాయం చేసిన ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రాపై నెటిజన్స్ ప్రస్తుతం ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.