ఫిల్మ్ డెస్క్- జబర్దస్త్ కామోడీ షో ఎంత పాపులర్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. జబర్దస్త్ లో పార్టిసిపెంట్స్ ఎంత పాపులరో, జడ్జీలు, యాంకర్స్ కూడా అంతే పాపులర్. అందులోను అనసూయ ఐతే మరి క్రేజ్. ఇద్దరు పిల్లకు తల్లి అయినా అనసూయ తన గ్లామర్ తో అందరిని మైమరపిస్తోంది. ఇక జబర్దస్త్ లో అనసూయ, హైపర్ ఆది చేసే హంగామా అంతా ఇంతా కాదు. వీరిద్దరు జత కూడారంటే జబర్దస్త్ లో రచ్చ రచ్చే. అనసూయ హొయలకు, హైపర్ ఆది పంచ్ లకు అంతే ఉండదు.
మామూలుగానే హైపర్ ఆది అంటే డబుల్ మీనింగ్ డైలాగులు, అదే ఇక అనసూయ తోడైతే వారిద్దరి అల్లరికి హద్దు అదుపు ఉండదు. తన పక్కన అనసూయ ఉంటే ఆదికి పూనకం వచ్చేస్తుందని అంటారు అంతా. మామూలు టైంలో అయితే పంచ్‌లే వేసే హైపర్ ఆది, అనసూయ పక్కన ఉంటే మరీ రెచ్చిపోతాడు. తాజాగా వచ్చే వారం జూలై 8 జబర్దస్త్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా, అందులో అనసూయతో ఆది చేసిన రచ్చ మామూలుగా లేదు.
హైపర్ ఆది ప్రతి వారం జబర్దస్త్ లో తన స్కిట్ లోకి వేరే షోలల్లో చేసే యాంకర్స్, సోషల్ మీడియా సెలబ్రిటీలను తీసుకువస్తుంటాడు. యధావిధిగా వాళ్లలో చాలామంది అందమైన అమ్మాయిలే ఉంటారు. ఇక ఈవారం అనసూయతో పాటు రోహిణి, ఢీ డాన్సర్ తోకలిసి హైపర్ ఆది స్కిట్ చేశాడు. ఇక స్కిట్ లో భాగంగా ఈ ముగ్గుర్నీ వరుసగా నిలబెట్టి మధ్యలో నిలబడ్డ ఆది, పొద్దున్న నీతో బ్రేక్ ఫాస్ట్ చేస్తా, మధ్యాహ్నం నీతో లంచ్ చేస్తా అన్నాక, అనసూయతో సాయంత్రం.. అని గ్యాప్ ఇచ్చి వదిలాడు. ఆ గ్యాప్‌లో .. చంపేస్తా అని సిగ్గుపడుతూనే చెప్పింది అనసూయ.
ఆ తరువాత అక్కడితో ఆగకుండా.. అందుకే మీతో ఏమీ చేయట్లా అని డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పాడు హైపర్ ఆద్. నువ్ మంచం రెడీ చేసి పెట్టు అని అనసూయను అదోలా చూస్తూ చెప్పాడు ఆది. ఆ ముగ్గురితో నువ్ మంచం రెడీ చేసి పెట్టు, నువ్ మల్లెపూలు రెడీ చేసిపెట్టు, నువ్వేమో బయట గొళ్లెం పెట్టు అని వరుస పంచ్‌లు పేల్చాడు. ఇంకేముంది సెట్ లో ఉన్న రోజా తో సహా, అంతా పెద్దగా నవ్వారు.