హైపర్ ఆది.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. తన కామెడీ టైమింగ్‌తో, పంచులతో ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించుకున్నాడు. ప్రారంభంలో తన కామెడీ వీడియోలతో యూట్యూబ్‌లో గుర్తింపు సంపాదించుకున్నాడు ఆది. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి రైటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఆర్టిస్టుగా మారి ఎన్నో స్కిట్లలో చేశాడు. ఇలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో అతడు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లాడు. ఇలా అతడి కెరీర్ పూర్తిగా మారింది.
జబర్ధస్త్ షో వల్ల ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న హైపర్ ఆది.. బుల్లితెరపై తనదైన మార్కును చూపించాడు. అలాగే, సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అందులోనూ తన శైలిని చూపించాడు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. అలాగే, ‘ఆటగదరా శివ’ అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. అల్లరి నరేష్ ‘మేడ మీద అబ్బాయి’ మూవీకి డైలాగ్స్ రాశాడు.
ఇది కూడా చదవండి: KGF మూవీని షారుఖ్ ఖాన్ తో తీసి ఉంటే ప్రేక్షకులు ఒప్పుకునేవారు కాదు!
దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న ‘ఢీ’ ప్రస్తుతం 14వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో నాలుగు టీమ్‌లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అందులో ఒక టీమ్‌కు హైపర్ ఆది మెంటర్‌గా చేస్తున్నాడు. అక్కడ కూడా తనదైన కామెడీ పండిస్తున్నాడు. జడ్జీలు, యాంకర్ ప్రదీప్ తో కలిసి స్కిట్స్ చేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Aata Show Title Winner Geethika : ఆట-4 డ్యాన్స్ షో టైటిల్ విన్నర్ గీతిక ఇప్పుడు ఎలా ఉందంటే..
ఈ క్రమంలో వచ్చే వారం ప్రసారం కాబోతున్న ‘ఢీ’ 14వ సీజన్ ఎపిసోడ్ మరింత ఫన్నీగా జరగబోతున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. ఈ ఎపిసోడ్ 1980 స్పెషల్‌గా సాగబోతుంది. ఇందులోకి ‘మా నీళ్ల ట్యాంక్’ సినిమా ప్రమోషన్ కోసం హీరో సుశాంత్, హీరోయిన్ ప్రియా ఆనంద్ గెస్టులుగా వచ్చారు. వీళ్లు కంటెస్టెంట్లు, టీమ్ లీడర్లతో కలిసి తెగ సందడి చేసేశారు.
ఇది కూడా చదవండి: Ramya Raghupathi: నరేష్, పవిత్రా లోకేష్‌లకు పెళ్లయిందంటున్న మూడో భార్య రమ్య
‘ఢీ’ షోలో భాగంగా ఎంట్రీ ఇచ్చిన ప్రియా ఆనంద్‌తో హైపర్ ఆది ఊహించని పని చేశాడు. అతడు డైరెక్టర్‌గా, ఆమె హీరోయిన్‌గా ఓ ఫన్నీ టాస్క్ చేశారు. అప్పుడు ఆది ‘హీరోయిన్ ఇలా రా అమ్మ. డైరెక్టర్‌తో ఫ్రీగా ఉండరా’ అంటూ ప్రియా ఆనంద్ భుజంపై చేతులు వేశాడు. ఆ తర్వాత కొన్ని డైలాగ్‌లు చెప్పి నవ్వించారు. అనంతరం ప్రియా ఆనంద్.. ఆదికి హగ్ ఇచ్చి షాకిచ్చేసింది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. కామెడీ తగ్గించి ఇలాంటి పనికిమాలిన వేషాలు వేస్తున్నావ్.. నీ వల్ల షోకు ఎవరైనా లేడీస్ రావాలంటేనే భయపడుతున్నారు.. ఇలా హగ్గులు అడుక్కోవడం ఏంట్రా నాయనా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. అంతేకాక.. ఇలాంటి అతి వేషాలు తగ్గించుకుంటే మంచిది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.