హైదరాబాద్- అక్రమ దందాలతో పాటు చట్టవ్యతిరేక కాలాపాలకు అలవాటు పడ్డ ఓ మాజీ నక్సలైట్ వాటికే బలయ్యాడు. చట్టవ్యతిరేకంగా పనిచేసే శక్తులతో జతకట్టి చివరకు వారి చేతుల్లోనే బలయయ్యాడు. ముగ్గురు ట్రాన్స్‌జెండర్‌లు కలిసి హత్య చేసి ఆ తర్వాత తల, మొండెం వేరు చేశారు. ఈ దారుణం ఆధిబట్ల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
నల్లగొండ జిల్లా, పీఏ పల్లికి చెందిన మాజీ నక్సలైట్ నామా శ్రీనివాస్(42) అనే వ్యక్తి బొంగుళూర్ సమీపంలోని మెట్రో సిటీ కాలనీలో మూడేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నివాసిస్తున్నాడు. పదేళ్ల క్రితమే శ్రీనివాస్ భార్య మృతి చెందగా.. అతడి కుమారుడు సొంతూరులో నాన్నమ్మ, తాతల దగ్గర ఉండి.. చదువుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు నెలలుగా శ్రీనివాస్ కనిపించకుండా పోయాడు. ఈ విషయం గురించి శ్రీనివాస్ ప్రియురాలి అతడి కుటుంబ సభ్యులకు చెప్పింది. దాంతో శ్రీనివాస్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విచారణలో షాకింగ్ విషయాలు తెలిసాయి. శ్రీనివాస్ ను అతడి స్నేహితులే అత్యంత దారుణంగా హతమర్చారు. శ్రీనివాస్‌ను హత్య చేసి.. తల, మొండం వేరు చేసి పూడ్చారు. నిందితుల్లో ఓ ట్రాన్స్‌జెండర్ కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….
శ్రీనివాస్ ఎల్ బీ నగర్ కు చెందిన బ్రహ్మచారి, నరేష్, రాజమ్మ అనే ట్రాన్స్‌జెండర్ స్నేహితులు ఉన్నారు. వీరిలో బ్రహ్మచారి నకిలీ బంగారం వ్యాపారం చేసేవాడు. గతంలో అతడిపై ఓ సారి కేసు నమోదయ్యింది. తన కోసం బెయిల్ తీసుకోవాలని బ్రహ్మచారి శ్రీనివాస్ కు డబ్బులు ఇచ్చాడు. కానీ అతడు పట్టించుకోలేదు. బ్రహ్మచారి ఏడాది పాటు జైల్లోనే ఉన్నాడు. శ్రీనివాస్ తనను మోసం చేశాడని.. అతడిపై కక్షగట్టాడు బ్రహ్మచారి. జైలు నుంచి విడుదలయ్యాక.. శ్రీనివాస్ పై పగ తీర్చుకోవాలని భావించి పథకం రచించాడు.
దానిలో భాగంగా.. నరేష్, రాజమ్మల సాయంతో నవంబర్ 12న దావత్ చేసుకుందామని.. శ్రీనివాస్ ను పిలిచారు. కారులో నలుగురు బొంగళూర్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. కారులో కూర్చున్న శ్రీనివాస్ మెడకు వెనక సీటు నుంచి బ్రహ్మచారి క్లచ్‌వైర్ బిగించాడు. నరేష్, రాజమ్మ కాళ్లూ చేతులు పట్టుకున్నారు.
ఇక శ్రీనివాస్ చనిపోయిన్నట్టు నిర్ధారించుకున్న ముగ్గురు స్నేహితులు.. మృతదేహాన్ని ఆడవిలోపలికి తీసుకెళ్లాలు తల, మొండెం వేరు చేశారు.. ఆతర్వాత మొండాన్ని, గుంత తవ్వి కప్పేశారు. తలను తీసుకెళ్లిన నరేష్ ఎక్కడో పాతిపెట్టాడు. దీని గురించి బ్రహ్మచారిని విచారించినా ఫలితం లేకపోయింది. పరారీలో ఉన్న నరేష్, రాజమ్మలు పట్టుపడితే మిగతా విషయాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు.