తిరుపతి– మంచి మనసున్న, అందమైన భార్యతో సవ్యంగా కాపురం చేసుకుంటున్న ఓ భర్తకు వక్ర బుద్ది పుట్టింది. తన భార్య చెల్లెలుపై ఆయన మనసు పడ్డాడు. ఏకంగా మరదలిని ప్రేమించేశాడు. ఆమే ఏమీ తక్కువ తినలేదు.. ఆమె కూడా అక్క మొగుడిని ప్రేమించింది. ఇంకేముంది ఇద్దరు కలిసి చెక్కేశారు.
ఇంకేముంది భార్య, అత్తమామలు పోలీసులను ఆశ్రయించారు. ఆ విషయం తెలుసుకున్న బావ, మరదళ్లు మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. బావ ఉరేసుకోగా, మరదలు మాత్రలు మింగింది. అతను ప్రాణాలు కోల్పోగా, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తిరుపతిలో ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ యువకుడి ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
అసలేంజరిగిందంటే.. హైదరాబాద్ లోని చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన 26 ఏళ్ల నవీన్ కు ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్టకు చెందిన బ్రహ్మేశ్వరితో నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లైంది. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో భార్య చెల్లెలు భువనేశ్వరిపై నవీన్ మనసు పడ్డాడు. ఇంకేముంది ఆమెతో మొల్లగా ప్రేమాయణం మొదలుపెట్టాడు. తన భార్యకు తెలియకుండా మరదలితో రొమాన్స్ చేస్తూ వచ్చాడు.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బావా మరదళ్లు ఇంటి నుంచి పారిపోయి తిరుపతికి వెళ్లారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న బావా మరదళ్లు ఏంచేయాలో తెలియక భయంతో సూసైడ్ చేసుకున్నారు. తిరుపతిలోని ఓ లాడ్జిలో బావ నవీన్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకోగా, మరదలు భువనేశ్వరి మాత్రలు మింగింది. ప్రస్తుతం ఆమె రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.