సాధారణంగా సమాజంలో శుభ్రంగా ఉండాలని మహిళలతో పాటు ప్రతీ ఒక్కరు అనుకుంటారు. దీనికి అనుగుణంగా ఇంటి శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగ శుభ్రతను పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతీ స్త్రీ కోరుకుంటుంది. కానీ ఓ మహిళ చేస్తున్న అతిశుభ్రత కారణంగా విసుగు చేందిన భర్త ఏకంగా విడాకులు కోరిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లండన్ లో నివాసం ఉంటున్న భార్యాభర్తలకు 2009లో పెళ్లి జరిగింది. అయితే కొన్ని కారణాలతో ఆ దంపతులు ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉంటున్నారు. అయితే తన భార్య అతిశుభ్రత పాటిస్తూ భర్తకు విసుగు చెందే దాక వెళ్లింది. ప్రతీ రోజు ఆరు సార్లు స్నానం చేయడం, స్నానం చేసిన సబ్బును కూడా శుభ్రం చేయటం, ఫోన్లు, ల్యాప్ టప్, షూష్ లు వంటి వాటిని డిజర్జెంట్ తో శుభ్రం చేస్తుంటే భర్త భాగా విసుగు చెందాడు. ఎంతకైన మంచిదని అప్పట్లో ఓ మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు.
ఆమె అబ్సెసివ్ కంపల్సిన్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతుందని వైద్యుడు నిర్ధారించాడు. దీంతో మందులు వాడడంతో కొన్నాళ్ల పాటు బాగానే ఉంది. అయితే లండన్ నుంచి బెంగుళూరు తిరుగొచ్చే సరికి మళ్లీ కథ మొదటికొచ్చింది. దీంతో అదే పనిగా ప్రతీది శుభ్రం చేయటం మొదలు పెట్టింది. ఇక తట్టుకోలేని భర్త విసుగు చెంది స్థానిక పోలీసులను ఆశ్రయించి తన భార్య అతిశుభ్రతను తట్టుకోలేకపోతున్నానని, ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని కోరాడు. ఇక ఈ కేసును పోలీసులు ఉమెన్ హెల్ప్ లైన్ సెంటర్ కు బదిలి చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక అతని భార్య పాటిస్తున్న అతిశుభ్రతపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.