మగవాళ్ళు ఎవరైనా తమకి అందమైన అమ్మాయి భార్యగా రావాలి అని కలలు కంటారు. ఆ కలలోనే చాల మంది ఉంటూ ఉంటారు. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోరు. కానీ.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్ లో ఆసిఫ్ అనే వ్యక్తికి మాత్రం భార్య మరీ అందంగా ఉండటం నచ్చలేదు. దానికి తోడు.., ఆమె ఇంకా అందంగా రెడీ అవ్వడం అస్సలు నచ్చలేదు. దీంతో.., అర్ధాంగిపై లేనిపోని అనుమానాలు పెంచుకున్నాడు. చివరికి ఆ అనుమానం కారణంగానే ఆమెని దారుణంగా కడతేర్చాడు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్ లో ఆసిఫ్ షాహిన్ అనే దంపతులు జీవిస్తున్నారు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. లారీ డ్రైవర్ గా పని చేస్తున్న ఆసిఫ్.. నాలుగు సంవత్సరాలు క్రితం కుటుంబాన్ని అశోక్‌నగర్ కి మార్చాడు. పెళ్లి అయిన మొదట్లో షాహిన్ తో బాగానే ఉన్న భర్త తరువాత మద్యానికి బానిసయ్యాడు. అక్కడ నుండి భార్యపై అనుమానం పెంచుకున్నాడు.
ఎందుకు రోజురోజుకి ఇంత అందంగా తయారు అవుతున్నావు? ఇంత బాగా ఎందుకు రెడీ అవుతున్నావు? ఎవరితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నావు? అంటూ ఆమెని మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. కానీ.., తన బిడ్డల భవిష్యత్ కోసం షాహిన్ భర్త అకృత్యాలను భరిస్తూ వచ్చింది. అయినా.. ఆసిఫ్ లో మార్పు రాలేదు కదా.. చివరికి తననే నమ్ముకుని ఉన్న భార్యని హత్య చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ అమలు చేశాడు,
మధ్యాహ్నం కొడుకును బ్యాంకు పనిమీద బయటకి పంపించాడు. అనంతరం కూతురు స్నానం చేయడానికి వెళ్లిన తర్వాత తన పథకాన్ని అమలు చేశాడు. భార్యతో అప్పటికే గోడవకు దిగిన ఆసిఫ్ పథకం ప్రకారం.. ముందుగా తెచ్చి పెట్టుకున్న కత్తితో ఆమె మెడపై నరికాడు. భార్య ఒక్క వేటుకి మరణించలేదనుకున్న ఆసిఫ్.. ఆమెని కత్తితో పలుమార్లు నరికాడు. దీంతో.., చుట్టుపక్కల వారు వచ్చే షాహిన్ అక్కడికి అక్కడే కన్నుమూసింది. ఇక స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఏసిపి..ఆసిఫ్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా.. తల్లి రక్తపు మడుగులో విగత జీవిగా పడిపోయి ఉండటంతో పిల్లలు బోరున విలపించారు. మరి.., ఇలాంటి భర్తలకు ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.