నేడు వివాహ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి అక్రమ సంబంధాలు. పెద్దల కుదిర్చిన పెళ్లైనా, ప్రేమ వివాహమైనా.. మ్యారేజ్ లైఫ్‌లోకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే మరొకరితో వివాహేతర, అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు భార్యా భర్తలు. భార్యకు తెలియకుండా భర్త మరో ఫ్యామిలీని
నేడు వివాహ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి అక్రమ సంబంధాలు. పెద్దల కుదిర్చిన పెళ్లైనా, ప్రేమ వివాహమైనా.. మ్యారేజ్ లైఫ్‌లోకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే మరొకరితో వివాహేతర, అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు భార్యా భర్తలు. భార్యకు తెలియకుండా భర్త మరో ఫ్యామిలీని పెడుతుంటే.. భర్తకు తెలియకుండా భార్య కూడా మరొకరితో శారీరక సంబంధాన్ని నెరుపుతుంది. దీని వల్ల కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. దానికి తోడు ఎప్పుడైనా దొరికిపోతే.. ఇక పూర్తిగా అడ్డం తిరిగేస్తున్నారు. తాము ఆ మూడవ వ్యక్తితో ఉండేందుకు ముందడుగు వేస్తున్నారు. ఇందులో వివాహిత మహిళలేమీ తక్కువ తినడం లేదు. భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన తర్వాత కూడా భార్య.. జీవిత భాగస్వామిపై విరుచుకుపడిపోవడం సర్వసాధారణం అయిపోతుంది.
ఇటీవల ఓ వ్యక్తి తన భార్యను బహిరంగ ప్రదేశంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో వైరల్ అవుతుంది. తన భార్య, మరో వ్యక్తితో ఓ షాపింగ్ మాల్ లో చేయి పట్టుకుని నడుస్తుండగా.. వెనుక నుండి భర్త వీడియో తీస్తూ వస్తున్నాడు. ఆమె తన భార్య అని మరొకరితో తిరుగుతుందంటూ అక్కడ ఉన్న కొంత మందితో చెబుతూ.. వారిని ఫాలో అవుతూ వెళ్లాడు. ఆ వీడియోలో భార్య, మరొకరి వ్యక్తితో చేతిలో చేయి వేసుకుని వెళుతుండగా..ఓ దగ్గర ఆగుతారు. అంతలో ఓ వ్యక్తి వచ్చి మిమ్మల్ని వీడియో తీస్తున్నారని మహిళకు చెబుతాడు. అంతే వెనక్కి తిరిగి చూడగా.. భర్త ఫోను పట్టుకుని వీడియో తీయడం కనిపిస్తుంది. షాక్ తిన్న భార్య.. భర్తతో వాదులాటకు దిగింది. ఆ తర్వాత అతడిపై దాడి కూడా చేసింది.
ప్రేమించి పెళ్లి చేసుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. ఇలా నా కుటుంబాన్ని, నన్ను మోసం చేస్తావా అంటూ భర్త అరవడం వినిపిస్తోంది. తొలుత అతడు తన స్నేహితుడని భార్య వాదిస్తుంది. అంతలో మీరిద్దరూ చేయి పట్టుకుని నడవడం తాను చూసేశాను.. అంతా రికార్డు అయ్యిందని అని సరికి ఫోన్ లాక్కొని అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. వెంటనే అక్కడికి చేరుకున్న ప్రజలు ఇద్దరినీ శాంతింప జేసే ప్రయత్నం చేశారు. అయితే భార్యా భర్తలు ఆ వ్యక్తితో పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. కొన్ని అసభ్య పదజాలాన్ని కూడా వినియోగించారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు భర్తకు సపోర్టుగా మరికొందరు భార్యకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ వీడియో ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ దాటేసింది.
Caught his #wife holding hands with someone in public.
Look how she started the aggression.#cheatingwife #Adultery pic.twitter.com/5tRw4b2Xe8
— ShoneeKapoor (@ShoneeKapoor) July 21, 2023