హైదరాబాద్ క్రైం- ఈ మధ్య కాలంలో తరుచూ వినిపిస్తున్న పదం అక్రమ సంబంధం. అవును నేటి సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. కొంత మంది పెళ్లయ్యాక భార్యతో కాకుండా మరొ మహిళతో, లేదంటే భర్తతో కాకుండా మరో పురుషుడితో అక్రమ సంబంంధం పెట్టుకుంటున్నారు. కానీ ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు ఛిన్నా భిన్నం అవుతున్నాయి. చివరికి ఆత్మహత్యలు, హత్యలకు దారితీస్తున్నాయి అక్రమ సంబంధాలు.
హైదరాబాద్ లో ఓ అక్రమ సంబంధం కాస్త కొత్తగా పెళ్లైన అభం శుభం తెలియని మహిళ ప్రాణాలను తీసింది. ఎన్నో ఆశలతో వైవావిహ జీవితంలోకి అడుగుపెట్టిన యువతి హత్యకు గురైంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజేశ్ వర్మ జీడిమెట్ల పరిధిలోని వినాయక్ నగర్‌లో గత ఐదేళ్లుగా ఉంటున్నాడు. అతని పక్క గదిలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సంజిత్, రింకు దంపతులు నివాసం ఉంటున్నారు. ఆటో నడిపే సంజిత్ జులాయిగా తిరగడంతో అప్పులపాలయ్యాడు. వారికి కుటుంబం గడిచేది కూడా కష్టంగా ఉండేది.
ఈ క్రమంలో సంజిత్ భార్య రింకుకు, పక్క గదిలో ఉండే రాజేశ్ తో అక్రమ సంబంధం ఏర్పడింది.ఇంకేముంది సంజిత్ ఇంటికి కావాల్సిన అవసరాలన్నీ రాజేశ్ చూసుకోవడం మొదలుపెట్టాడు. ఈ విషయం సంజిత్‌కు తెలిసినా చూసిచూడనట్లు ఉండేవాడు. దీంతో రాజేశ్ సైతం సంజిత్ ఖర్చుల కోసం డబ్బులు కూడా ఇచ్చేవాడు. సంజిత్ కు, రింకుకు ఏంకావాల్సినా రాజేశ్ చూసుకునేవాడు.
ఇటువంటి సమయంలో రాజేశ్ కు పెళ్లి నిశ్చయం అయ్యింది. ఈ సంవత్సరం ఏప్రిల్ లో జార్ఖండ్ కు చెందిన 21 ఏళ్ల పూజను రాజేశ్ పెళ్లి చేసుకున్నాడు. ఆమెను హైదరాబాద్ లో తను ఉంటున్నగదికి తీసుకువచ్చి, ఇక్కడే కాపురం పెట్టాడు. ఐతే తనకు పెళ్లైనప్పటి నుంచి సంజిత్, రింకు దంపతుల ఇంటి ఖర్చులకు డబ్బులివ్వడం మానేశాడు. దీంతో రాజేశ్ పెళ్లి చేసుకోవడం వల్లే తమకు కష్టాలు వచ్చాయని, ఇక రాజేశ్ పూర్తిగా తమకు దూరమవుతాడని వాళ్లిద్దరు భావించారు.
అందుకే కొత్తగా రాజేశ్ జీవితంలోకి వచ్చిన అతని భార్య పూజను హత్య చేయాలని పధకం రచించారు. ఈనెల 10న రాజేశ్ విపని మీద బయటకు వెళ్లడంతో, గదిలో నిద్రపోతున్న పూజ మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. సాయంత్రం రాజేశ్ వచ్చి చూసేసరికి తన భార్య చనిపోయి ఉంది. అసలేమైందని రాజేశ్ అడగడంతో ఆమె ప్రియుడు, మరో వ్యక్తి వచ్చి పూజతో గొడవపడ్డారని, ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని, పూజ వారితో వెళ్లనని చెప్పడంతో హత్య చేశారని కట్టుకథ చెప్పారు సంజిత్, రింకు.
వీరిద్దరి తీరు కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో, పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. అప్పుడు వారుచేసిన దారుణాన్ని చెప్పారు. రింకు, సంజిత్ లను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని రిమాండ్ కు తరలించారు. ఈ అక్రమ సంబంధంతో ఏ మాత్రం సంబంధం లేని పూజ హత్యకు గురవ్వడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.