మూఢ నమ్మకాలు ఇంకా కొన్ని గ్రామాల్లో రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా తండా, గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయాల పేరిట కొన్ని వింత ఆచారాలను కొనసాగిస్తున్నారు. చిన్నప్పుడే చెట్లకిచ్చి, జంతువులకిచ్చి బాల్య వివాహాలు చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ పెళ్లి చర్చనీయాంశంగా మారింది.
శాస్త్ర, సాంకేతికలో భారత్ ఎంత ముందుకు దూసుకువెళుతున్నా ఇంకా అజ్షానమనే అంధకారంలో బతుకుతూనే ఉంది. సంప్రదాయాల ముసుగులో.. వింత ఆచారాలు చేస్తూనే ఉన్నారు. మగాళ్లకు అక్కరకు రాని ఆచారాలు, సంప్రదాయాలు.. ఆడవారికి, చిన్న పిల్లలకు ఏమిటీ అన్నదీ మేథావులు, శాస్త్రవేత్తల ప్రశ్న. అయినప్పటికీ ఆగని మూఢ నమ్మకాలు ఇంకా కొన్ని గ్రామాల్లో రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా తండా, గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయాల పేరిట కొన్ని వింత ఆచారాలను కొనసాగిస్తున్నారు. చిన్నప్పుడే చెట్లకిచ్చి, జంతువులకిచ్చి బాల్య వివాహాలు చేయడం చూస్తూనే ఉన్నాం. వార్తల రూపంలో చదివాం. అటువంటి వింత ఆచారమే ఇప్పడు ఒడిశాలో వెలుగు చూసింది.
చిగురుపై పన్ను వచ్చిందని ఇద్దరు చిన్నారులకు కుక్కలతో బాల్య వివాహం జరిపించిన ఘటన బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ జిల్లాలో బొంధొసాహి గిరిజన గ్రామం ఉంది. మఛువాసింగ్ కుమారుడు, మానస్‌సింగ్ కుమార్తెకి చిగుళ్లపై బాల దంతం మొలిచింది. బాలలకు పైవరసలో తొలి దంతం మొలిస్తే పలు రకాల వ్యాధులు వేధిస్తాయని ఆ గ్రామం భావిస్తుంటోంది. ఆ అరిష్టం తొలగించేందుకు బాలుడు లేదా బాలికను కుక్కతో పెళ్లి జరిపించడం ఆచారంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆ ఇద్దరు చిన్నారులకు వేర్వేరుగా కుక్కలతో పెళ్లి జరిపించారు. అదీ వైభవంగా. అలా చేస్తేనట.. పిల్లల్లో ఉన్న వ్యాధులు, అరిష్టాలు.. పెళ్లి జరిపించిన శునకానికి సంక్రమించి, మరణిస్తుందని నమ్మకం. దీంతో పిల్లలు ఆరోగ్యవంతులౌతారని విశ్వసిస్తారు.
మఛువా సింగ్ కుమారుడికి ఆడ కుక్క, మానస్‌సింగ్ కుమార్తెకు మగ కుక్కతో పెళ్లి వేడుకగా జరిపించారు. పెళ్లి తంతును సంప్రదాయ రీతుల్లో , బంధు, మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపించారు. ఆ గ్రామంలో 7 కుటుంబాలకు చెందిన సభ్యులు పసుపు, ఆవాలు, మరుగునీళ్లతో పెళ్లి వారింటికి చేరారు. ఈ బృందంతో కలిసి వధూవరుల కుటుంబీకులు గ్రామం నాలుగు దిక్కుల కూడలి ప్రాంతానికి చేరారు. ఈ కుటుంబాల సభ్యులు తీసుకు వచ్చిన మరుగునీటితో బాలలకు స్నానం చేయించారు. ఈ తంతు అనంతరం పిల్లలను, కుక్కలను అలంకరించి, పెళ్లి మండపానికి తీసుకువచ్చారు. కుక్క చీలమండకు సంప్రదాయ సూత్రం తొడిగి పెళ్లి జరిపించారు. దీంతో పెళ్లి అయిపోయింది.