మల్టీస్టారర్‌లు ఇండస్ట్రీకి కొత్తేమీ కావు. కానీ, కొన్ని మల్టీస్టారర్‌ల కోసం అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒకప్పుడు తెలుగు సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ల కాంబో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ట్రేడింగ్ మారింది. ప్యాన్ ఇండియా సినిమాల ప్రభావం పెరిగిపోయిన తర్వాత సౌత్, నార్త్ అన్న తేడాలు పోయాయి. ఇక్కడివారు అక్కడి సినిమాల్లో.. అక్కడి వారు ఇక్కడి సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. ప్యాన్ ఇండియా స్టార్లుగా.. ప్రభాస్, యశ్, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. సౌత్ హీరోలను లీడ్‌లో పెట్టి బాలీవుడ్‌లో సినిమాలు సైతం తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్, హృతిక్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే ఓ న్యూస్ మీడియా సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్, హృతిక్ హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్ తెరకెక్కనుందట. ఈ సినిమాకు పటాన్ సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారట. ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఓ ఖరీదైన సినిమాగా తెరకెక్కనుందట. మైత్రి మూవీమేకర్స్ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభం కానుందట. 2025లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందట. మరి, ఇదే గనుక నిజం అయితే, ఈ సినిమా ప్యాన్ వరల్ట్ సినిమా అవ్వనుందని అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి, ప్రభాస్, హృతిక్‌లు హీరోలుగా పటాన్ సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కనుందన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.