పని మనుషులు..ఇంట్లో పనులతో పాటు తమకు సాయం చేస్తూ ఉంటారని భావిస్తుంటారు ఇంటి యజమానులు. కొంత మంది చాలా నమ్మకస్థులుగా ఉంటూ యజమాని మెప్పు పొందుతూ.. అభినందనలతో పాటు బహుమతులు పొందుతుంటారు. కానీ కొంత మంది మోసం చేస్తూ.. తిన్నింటి వాసాలు లెక్కబెడుతుంటారు.
ఇంట్లో పని చేసుకోలేని పరిస్థితులు లేదా ఇతర కారణాలతో పని మనుషుల్ని పెట్టుకుంటారు. ఇంట్లో పనులతో పాటు తమకు సాయం చేస్తూ ఉంటారని భావిస్తుంటారు ఇంటి యజమానులు. కొంత మంది చాలా నమ్మకస్థులుగా ఉంటూ యజమాని మెప్పు పొందుతూ.. అభినందనలతో పాటు బహుమతులు పొందుతుంటారు. కానీ కొంత మంది మోసం చేస్తూ.. తిన్నింటి వాసాలు లెక్కబెడుతుంటారు. వారి ఇంట్లో దొంగతనాలకు పాల్పడటమో లేదంటే ఇంటి యజమానులను రహస్యాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేయడం వంటివి చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పనోడు మాత్రం నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లు కనిపిస్తోంది. ఏకంగా యజమానురాలికి తెలియకుండా స్పై కెమెరాలు పెట్టి.. ఆమెనే బెదిరించడం మొదలు పెట్టాడు.
ఈ ఘటన హర్యానాలోని గురుగ్రాంలో చోటుచేసుకుంది. ఇంటి యజమానురాలి బెడ్ రూంలో సీక్రెట్ కెమెరాలు అమర్చి..ఆమె వ్యక్తిగత వీడియోలను చూపించి డబ్బుల కోసం బెదిరించడం మొదలు పెట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా శుభం కుమార్ అనే వ్యక్తిని పనిమనిషిగా పెట్టుకుంది ఓ మహిళ. పనిలో చేరిన శుభం కుమార్.. ఆమెకు తెలియకుండా బెడ్ రూంలో స్పై కెమెరాలు పెట్టాడు. అయితే ఇటీవల ఆమె తన గది శుభ్రం చేస్తుండగా యజమానురాలు సీక్రెట్ కెమెరా ఉన్నట్లు గుర్తించింది. ఇది కొత్తగా చేరిన శుభం కుమార్ పనేనని గ్రహించి.. పిలిచి అడిగితే.. చివరకు వారిపైనే దాడికి దిగాడు. పోలీసులకు ఈ విషయం చెబితే.. సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత వీడియోలను పోస్టు చేస్తానంటూ బెదిరించాడు.
అయితే శుభం కుమార్ గురించి సదరు ఏజెన్సీకి మహిళ చెప్పగా.. అతడ్ని ఉద్యోగం నుండి తొలగించింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు.. సదరు మహిళ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. ఉద్యోగం పోవడంతో డబ్బు కోసం యజమానురాలిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు శుభం కుమార్. రూ. 2 లక్షలు ఇవ్వకుంటే.. వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పోస్టుచేస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టారు. దీంతో అప్పుడు సదరు మహిళ గత వారం సైబర్ పోలీసులను ఆశ్రయించి.. అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శుభం కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.