హాప్​షూట్స్​ – కేజీ అక్షరాల లక్ష రూపాయలు!!

ప్రపంచంలోనే అతి ఖరీదైన పంట. ఆరు గాలం కష్టపడి కన్న బిడ్డలా పంటను కాపాడి శ్రమించే రైతన్నకు, అతడి పంటకు మార్కెట్‌లో విలువలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మూడు పూటలా తిండి దొరకడం లేదనేది అక్షర సత్యం. మన రాజకీయ నాయకులు రైతే రాజు. దేశానికి వెన్నెముక అంటూ అతడి వెన్ను విరిచి కార్పొరేట్‌ సంస్థలకు లాభం చేకూరుస్తారు. అయితే వ్యవసాయం పూర్తిగా నష్టదాయకమేనా అంటూ కాదు. సేంద్రియ ఎరువులను వాడుతూ మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా పంటలు పండించే వారికి సేద్యం కనక వర్షం నిజమేనంటూ రుజువు చేసాడు ఓ బీహార్ రైతు.   కొత్తరకం కూరగాయను  ప్రస్తుతం అది కేజీ అక్షరాల లక్ష రూపాయలకు అమ్ముడవుతోంది. నమ్మలేక పోయినప్పటికి ఇది మాత్రం వాస్తవం. బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా కరమ్‌దిహ్ గ్రామానికి చెందిన చెందిన అమ్రేష్ సింగ్ అనే 38 ఏళ్ల రైతు తాతల కాలం నుంచీ వస్తోన్న పంటలను సాగుచేసి విసిగి వేసారి పోయాడు. ఈ ఏడాది తన పంథా మార్చిన అమ్రేష్ సింగ్ ‘హాప్ షూట్స్’ అనే కూరగాయను సాగుచేస్తున్నాడు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయగా ‘హాప్ షూట్స్’కు పేరుంది. ‘హాప్ షూట్స్’ కిలో ధర కనిష్టంగా 85,000 రూపాయలు ఉంటుంది. డిమాండ్‌ను బట్టి కొన్ని సందర్భాల్లో కిలో లక్ష రూపాయల వరకూ పలుకుతుంది. ఈ కూరగాయ సాగుకు తన సొంత పొలాన్ని సిద్ధం చేసిన అమ్రేష్ రూ.2.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. పంట దిగుబడి కూడా ఆశించిన విధంగానే ఉంది. ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్, పురుగు మందులు వాడకుండా అమ్రేష్ ఈ పంటను పండించడం విశేషం. ‘హాఫ్ షూట్స్’ శాస్త్రీయ నామం హ్యుములస్ లుపులస్. ఈ కూరగాయ మొక్కలను వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ లాల్ పర్యవేక్షణలో పెంచుతున్నారు. అమ్రేష్ కూడా తన పొలంలో ఈ మొక్కలను నాటేందుకు అక్కడి నుంచే తెచ్చాడు. ఈ మొక్కకు పూచే పూలను ‘హాప్ కాన్స్’ అంటారు. బీర్ తయారీలో వీటిని వాడతారు. ఈ మొక్క కొమ్మలను పొడిగా చేసి మెడిసిన్ తయారీలో వినియోగిస్తారు. అమ్రేష్ సింగ్ ‘హాప్ షూట్స్’ పండిస్తున్న విషయాన్ని సీనియర్ బ్యూరోక్రాట్, ఐఏఎస్ సుప్రియా సాహు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వ్యవసాయంలో ఓ కొత్త ప్రయత్నం చేసిన అమ్రేష్‌ను ఆమె అభినందించారు. అమ్రేష్ ప్రయత్నం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తుందని, వ్యవసాయంలో రైతులు అధిక మొత్తంలో లాభాలు గడించేందుకు వీలవుతుందని సుప్రియ ఆశించారు. హాప్ షూట్స్ పండ్లు, పూలు, ఆకులు, కాండం అన్నింటికీ ఔషధ గుణాలు ఉంటాయి. బీర్ లలో మంచి ఫ్లేవర్ కోసం, స్టెబిలిటీ ఏజెంట్ గా దీని పూలను వాడతారు. స్కిన్ ముడతలు పోగొట్టి యంగ్ లుక్ ను ఇస్తుంది. నిలువెల్లా ఔషధ గుణాలున్నయి కాబట్టే హాప్ షూట్స్ ధర కూడా ఆ రేంజ్ లో చెప్తున్నారు. ఒక్కడు చూపిన బాట ఇప్పుడే అక్కడ వేలమందికి లక్షలను సంపాదించేలా చేయడం ఖాయం.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV