Honey Trap : ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. సైబర్ నేరగాళ్లు ఇలా ఫేక్ అకౌంట్లతో యూజర్లను దోచేస్తుంటారు. కొంతమంది యూజర్లు కూడా తాము మోసపోవటానికే పుట్టినట్లు వారి వలలో చిక్కి సర్వం కోల్పోతుంటారు. తాజాగా, ‘అల్లరి పిల్ల’ అనే ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ వలలో చిక్కి పలువరు దారుణంగా మోసపోయారు. లక్షల రూపాయలు వదల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముపట్ల మానస అనే యువతి ఫేస్‌బుక్‌లో ‘అల్లరి పిల్ల’ అనే పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది.
ఎంపిక చేసుకున్న కొంతమందికి మాత్రమే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేది. వాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సప్ట్ చేయగానే ఎఫ్‌బీ మెసెంజర్ ద్వారా వారితో చాట్ చేసేది. వారినుంచి మొబైల్ నెంబర్లను సేకరించేది. వారితో బాగా క్లోజ్ అయిన తర్వాత నగ్నంగా కాల్స్ చేసేది. ఆ తర్వాత వారిని బాగా నమ్మించి కొన్ని యాప్స్‌కు సంబంధించిన లింక్స్‌ను వారికి పంపేది. వాళ్లు వాటిని డౌన్‌లోడ్ చేసుకోగానే బాధితుల ఫోన్ ఆమె కంట్రోల్‌లోకి వెళ్లిపోయేది. ఆ తర్వాత తన అకౌంట్ నెంబర్‌ను కూడా ఫోన్‌లో యాడ్ చేసుకోమని అడిగేది. వారు ఆమె చెప్పినట్లుగానే చేసేవారు.వారు అలా చేయగానే పర్సనల్ డీటేల్స్ మొత్తం రికార్డ్ అయ్యేవి. ఆ వెంటనే అతడి అకౌంట్‌లోని డబ్బును కమీషన్‌కు పనిచేసే వారి అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేసేది. వారు ఏటీఎమ్ కార్డులతో డబ్బు విత్‌డ్రా చేసి కమిషన్ డబ్బును ఉంచుకుని మిగిలిన డబ్బు ఆమెకు పంపేవారు. బాధితుల కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్యాంగ్‌లోని ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారినుంచి రెండున్నర లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మానస కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.