బాక్సాఫీస్‌ను బాలయ్య అఖండ సినిమా షేక్ చేస్తుంది. కరోనాతో చాలా కాలంగా పూర్తిస్థాయిలో నిండని థియేటర్లు అఖండతో ఆ బెంగ తీర్చుకున్నాయి. సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న అంఖడ సినిమాపై ఇప్పటికే బాలీవుడ్ దర్శక, నిర్మాతలు కన్నేశారు. కాగా ఇప్పుడు హాలీవుడ్ క్రిటిక్‌లు సైతం బాలయ్య అఖండను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం క్రిటిక్ సైమన్ అబ్రంస్ ‘అఖండ’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ఎపిక్ ఫిల్మ్ అఖండ ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేశానని.. ఒక సాధారణ వ్యక్తి అవినీతిపరుడైన మైన్ ఓనర్‌తో గొడవ పడతాడని పేర్కొన్నారు. ఇక సెకండ్ హాఫ్‌లో హీరో ట్విన్ బ్రదర్ ‘అఖండ’ వచ్చాక సీన్స్ చాలా స్పెషల్ అని తెలిపారు.
మూవీలో కార్టూనిష్ సెట్స్, విండ్ మెషిన్లు, మాస్టర్ షాట్స్, క్లోజప్ షాట్స్, కొరియోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే తన చెవులు పగిలిపోతాయని అనిపించిందని.. శివుడి రూపంలో అఖండ ఫైట్ సీన్ అద్భుతం అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. తెలుగు సినిమా గురించి ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్రిటిక్ ఈ స్థాయిలో పొగడ్తలు గుప్పించడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరి అంఖడ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
I enjoyed the first half of the Telugu language Indian action epic AKHANDA, about an area man who picks a fight with a corrupt mine owner. But the second half brings in the title character, the twin brother of the first half’s lead. Then it becomes something special.
— Simon Abrams (@simonsaybrams) December 3, 2021