లాయర్లకు ఓ సింబల్, పోలీసులకు ఓ సింబల్ ఉంటాయి. అలాగే వైద్యరంగానికి కూడా ఓ సింబల్ ఉంది. అది ఎలా ఉంటుంది అంటే.. ఓ కర్రని రెండు పాములు చుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు.. దానిపైన పక్షి రెక్కలు కనిపిస్తాయి. వైద్య రంగానికి ఏ మాత్రం సంబంధం లేని అంశం ఎందుకు సింబల్‌గా మారింది అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి.. సింబల్ వెనుకు అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఒలింపియన్ దేవుడు హీర్మెస్ వద్ద ఒక కర్ర ఉండేది. గ్రీకు పురాణాల ప్రకారం.. దేవతలకు మనుషులకు మధ్య హీర్మేస్ దూతగా ఉండేవారట. దేవదూత కావడం వల్ల అతడికి రెక్కలు ఉండేవి. ఒకప్పుడు రోగులు వైద్యుడిని కలిసేందుకు కాలినడకన ఎంతో దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. కానీ రెక్కలు కలిగిన హీర్మేస్ అనే దేవదూత వారి బాగోగుల చూసుకునేవాడు. అనారోగ్యంతో బాధపడేవారికి వైద్యం కూడా చేసేవాడు. అందుకే, వైద్య చిహ్నంలో అతడి రెక్కలు, కర్రను చేర్చారని అంటుంటారు. ఇక పాముల విషయానికి వస్తే.. అపోలో అనే దేవుడు అప్పట్లో జనాలకు వైద్యం అందించేవాడు. అలాగే దేవదూత హీర్మెస్ చేపట్టిన కార్యక్రమాలకు సాయం చేస్తుండేవాడు. ఎలా అంటే ఒకవేళ వైద్యం అందించేందుకు సిబ్బంది లేకపోతే.. తన దగ్గర ఉన్నవారిని పంపించేవాడు.
అలాగే జూస్ అనే రాజు కూడా హర్మస్‌కు సహాయం చేసేవారు. అందుకు వీరిద్దరిని తెల్లటి రిబ్బన్లుగా సూచించి ఆ కర్ర చుట్టు జోడించారు. అలా ఆ కర్ర చుట్టు రెండు రిబ్బన్లు పెన వేసుకున్నట్లు ఉంటాయి. కాలక్రమేనా వాటిని పాముల మాదిరిగా మార్చేశారు. ఎందుకంటే.. గ్రీకులో పాములను పవిత్రంగా చూస్తారు. దీంతో రిబ్బన్ల స్థానంలో పాములను ఉంచారు. దాని అర్థం ఏంటంటే.. పాములు గొడవపడుతుంటే హీర్మెస్ కర్ర వాటిని ఆపుతుంది అని. ఇలా ఏర్పడిన గుర్తును”కాడ్యూసియస్” అని పిలుస్తారు. మరి.. విషాయాల కోసం ఈ క్రింది వీడియోపై ఓ లుక్యేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.