తన సినిమాకి తానే గెస్ట్‌గా ఎంటరయ్యారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఛత్రపతి’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు రాజమౌళి, ఇటు ప్రభాస్ కి మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈరోజు (జూలై 16న) ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి దర్శకుడు రాజమౌళి, స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం సహా పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అథిదులుగా హాజరయ్యారు.
ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటన వచ్చింది. అయితే ఇప్పటికే ఈ రీమేక్ సెట్స్‌పైకి వెళ్ళాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కుదరలేదు. వి.వి.వినాయక్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిందీలో ఇది డెబ్యూ సినిమా. ఈపాటికే సెట్స్ మీదకి రావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రారంభమవలేదు. ఈ సినిమా పట్టాలెక్కే విషయంలోనూ రకరకాల పుకార్లు షికారు చేసినా, హైదరాబాద్ లో వేసిన విలేజ్ సెట్ వర్షాల కారణంగా డామేజ్ కావడంతో ఇప్పుడు దాన్ని మళ్ళీ సెట్ చేస్తున్నారు.
సినిమాలో తన లుక్, బాడీ లాంగే పర్పిగా ఉండాలని బెల్లంకొండ ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. సరైన పద్ధతిలో కసరత్తులు చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతే కాదు హిందీ తనే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. హిందీ భాషపై అవగాహన ఉన్నప్పటికీ మరింత పట్టుసాధించేందుకు, ఉన్నపరంగా మరింత స్పష్టత ఉండాలని భావించి హిందీ భాష నేర్పించే కోచ్ ఇంతియాజ్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.