కస్తూరి శంకర్.. ఒకప్పుడు వెండితెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. ఇప్పటి సీనియర్ హీరోలలో చాలా మంది సరసన కస్తూరి నటించింది. సోగ్గాడి పెళ్ళాం, భారతీయుడు, అన్నమయ్య వంటి చిత్రాలు ఈమెకి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కస్తూరి.., మళ్ళీ నటన వైపు తిరిగి చూసింది లేదు.
కానీ.., ఎన్నో ఏళ్ళ గ్యాప్ తరువాత ఇప్పుడు కస్తూరి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. తెలుగులో ఈమె లీడ్ రోల్ చేస్తున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మీ. ప్రస్తుతం ఈ సీరియల్ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇందులో తులసి పాత్రలో కస్తూరీ శంకర్ అదర కొట్టేస్తోంది. ఇక తాజాగా ఇంటింటి గృహలక్ష్మీ టీమ్ ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న షోకి పార్టిసిపేట్స్ గా వచ్చారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో కస్తూరి బాగా ఎమోషనల్ అయ్యి, కన్నీరు పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మీరు మంచి నటి. ఇన్నాళ్లు.. ఎందుకు యాక్టింగ్ కి దూరంగా ఉన్నారని ఓంకార్.. కస్తూరీని ప్రశ్నించాడు. దీనికి సమాధానం ఇస్తూ.., కస్తూరి ఎమోషనల్ అయిపోయింది. “నేను ఇప్పటికే జీవితంలో మూడు సార్లు చావును చూశాను. అమ్మనాన్నల విషయంలో రెండు సార్లు. మూడోసారి నా కూతురు. పాపని మూడేళ్లు ఆస్పత్రిలోనే చూసుకుంటూ ఉన్నాను.. కొడుకు పుట్టినా కూడా వాడ్ని చూడలేదు అంటూ కన్నీరు పెట్టేసింది కస్తూరి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ లో కస్తూరి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.