హైదరాబాద్- పోలీసులు ఎంత నిఘా పెట్టినా నేరాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లాంటి మహా నగరంలో పోలీసులు 24 గంటలు పహారా కాస్తుంటారు. పెట్రోలింగ్ వాహనాల్లో ప్రతి క్షణం గస్తీ నిర్వహిస్తుంటారు పోలీసులు. అయినప్పటికీ ఎక్కోడో చోట దోపిడీలు, దొంగతనాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్ లో ఈ సారి ఏకంగా ఓ హిరోయిన్ పై దాడి జరిగింది. వాకింగ్ కు వెళ్లిన నటిపై దాడి చేసి సోల్ ఫోన్ లాక్కుపోయాన ఘటన కలకలం రేపుతోంది. నగరం నడిబొడ్డున కేబీఆర్ పార్కులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో వాకింగ్ కోసం పార్కుకి వెళ్లిన టాలీవుడ్ నటి, మోడల్ షాలు చౌరాసియాపై ఓ గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు.
ఆమె మొబైల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించగా చౌరాసియా తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. రాత్రివేళ కావడంతో పార్కులో జనసంచారం తక్కువగా ఉండటంతో ఆమెకు ఎవరు కనిపించలేదు. పార్క్ లో ఎవరు లేని సమయాన్ని చూసుకుని ఒంటరిగా ఉన్న చౌరాసియాపై కన్నేసిన దుండగుడు ఆమెను అడ్డగించి సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయాడు.
ఈ ఘటనలో నటి చౌరాసియా గాయాలపాలైంది. వెంటనే ఆమె పోలీస్ కంట్రోల్ రూం 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో హుటాహుటిన కేబీఆర్ పార్క్‌కి చేరుకున్న పోలీసులు చౌరాసియాను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నటి చౌరాసియా కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అన్నట్లు చౌరాసియా ఓ పిల్లా నీల్ల, అరణ్యంలో వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.