Vishal: కుప్పం రాజకీయాలు కొత్త ఎత్తులకు, పైఎత్తులకు వేధిక కానున్నాయా?.. కుప్పం నియోజకవర్గ దత్తపుత్రుడుగా చెప్పుకుంటున్న నారా చంద్రబాబునాయుడికి గడ్డు కాలం రానుందా?.. బాబు కంచుకోటలో తమ జెండా ఎగురవేయటానికి వైఎస్సార్ సీపీ బలంగా పావులు కదుపుతోందా?.. కుప్పంలో నేమ్, ఫేమ్ ఉన్న, తనకు ఎంతో సన్నిహితుడైన ఓ హీరోను బాబుకు పోటీగా నిలబెట్టాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారా?… ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఓ న్యూస్ కారణంగా రాష్ట్ర రాజకీయాలపై అవగాహన ఉన్న సగటు ప్రజల మెదుళ్లను తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. కుప్పంలో చంద్రబాబుకు పోటీగా ఓ హీరోను దింపుతారని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ ఎవరా హీరో?.. ఎంటా కథ?.. కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా స్టార్ హీరో అన్న ప్రచారంపై ఆ పార్టీ నాయకుడు వెంకటరెడ్డి ఏమన్నారు?.. ఇప్పుడు తెలుసుకుందాం.. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంనుంచి గత కొన్ని దశాబ్ధాలుగా శాసనసభకు పోటీ చేసీ గెలుస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడినుంచి పోటీ చేసి గెలిచి, ముఖ్యమంత్రిగా పలు మార్లు బాధ్యతలు చేపట్టారు. దాదాపు 7 సార్లు కుప్పం నుంచి చంద్రబాబు గెలుపొందారు. ఒకరకంగా చెప్పాలంటే కుప్పం చంద్రబాబు కంచుకోట. ఇప్పుడు ఆ కంచుకోటపై వైఎస్సార్ సీపీ కన్నేసిందన్న ప్రచారం జరుగుతోంది.
అక్కడ చంద్రబాబును ఓడించటానికి తమిళ స్టార్ హీరో విశాల్‌ను రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాల్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత ఆప్తుడన్న సంగతి తెలిసిందే. పైగా ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావటంతో వైసీపీ నుంచి విశాల్‌ను కుప్పంలో పోటీ చేయించాలని వైఎస్ జగన్ చూస్తున్నారంట. స్టార్‌డమ్ ప్లస్ వైసీపీ ప్రాభల్యం కలిసి చంద్రబాబును ఓడించే అవకాశం ఉందని భావిస్తున్నారంట. ఇప్పుడు ఇదే ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతోంది. ఇక, ఈ ప్రచారంపై వైఎస్సార్ సీపీ నాయకుడు వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
‘‘ సీట్లకు సంబంధించిన అన్ని నిర్ణయాలు సర్వేలను బట్టే తీసుకోవటం జరుగుతుంది. సర్వేల ప్రకారమే టిక్కెట్లు. అది కూడా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు జరుగుతాయి. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వెళతాం. 175లో కుప్పం కూడా ఉంది. కుప్పంలో గెలుపుకోసం వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారు. అక్కడ పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలిచాం. ముందెన్నడూ ఇలా జరగలేదు. ఇక, విశాల్ పోటీపై నాకు సమాచారం లేదు. అతడు కూడా ప్రజాసేవలో ఉన్నాడు. ఆయన పెద్ద మనసు అన్ని చోట్లా చూశాం. విశాల్ ఏపీలో ఎక్కడినుంచైనా పోటీకి ఆసక్తి చూపిస్తే ఎక్కడినుంచి పోటీ చేయించాలనేది వైఎస్ జగన్ నిర్ణయిస్తారు’’ అని అన్నారు. మరి, కుప్పంలో చంద్రబాబుకు పోటీగా విశాల్ పోటీ చేయనున్నారని జరుగుతున్న ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Amaravati Lands: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకానికి అమరావతి భూములు.. ధర కోట్లలో!