ఫిల్మ్ డెస్క్- నాచురల్ స్టార్ నాని తాజా సినిమా శ్యామ్ సింగరాయ్ మంచి విజయం సాధించింది. ఈ సినిమా విడుదల సమయంలో నాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచనంగా మారాయి. ఏపీలో సినిమా టికెట్ రేట్స్‌ను ఉద్దేశించి థియేటర్ కంటే పక్కనున్న కిరాణా షాప్‌లో ఎక్కువగా డబ్బులుంటున్నాయని నాని అనడం అప్పట్లో సంచలనంగా మారింది.
మొత్తానికి శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ అవ్వడం, సక్సెస్ సాధించడంతో నాని హ్యాపీ అయ్యాడు. ఇదిగో తాజాగా మెగాస్టార్ చిరంజీవిని హీరో నాని కలిశాడు. ఈ మేరకు నాని తన ట్విట్టర్ లో చిరంజీవిని కలిసిన ఫొటోను షేర్ చేశారు. మరి వీళ్లిద్దరు రీసెంట్ గా కలిశారా, లేదంటా పాత ఫోటోను నాని షేర్ చేశారా అన్నిది మాత్రం క్లారిటీ లేదు. ఫోటోలో ఓ వైపు చిరంజీవి, మరో వైపు నాని మీసాలు తిప్పుతూ కనిపిస్తున్నారు.
తన తాజా సినిమా శ్యామ్ సింగరాయ్ సక్సెస్ ను నాని చిరంజీవితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారని తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ గురించి చిరంజీవి నాని ప్రత్యేకంగా అభినందించారట. చిరంజీవితో ఉన్న ఫొటోను షేర్ చేసిన నాని, దాంతో పాటు లవ్ సింబల్‌ను కూడా పెట్టారు. ఈ ట్వీట్‌ను శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ షేర్ చేస్తూ మై హీరోస్ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా సోషల్ మీడియాలో చిరంజీని పక్కన నానిని చూసిన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎందుకంటే ఆ ఫొటోలో నానికి తెల్ల వెంట్రుకలున్నట్లు కనిపించడమే వారి బాధకు కారణమట. అదేంటన్నా నువ్వు అప్పుడే ముసలోడివి అయిపోతున్నావంటూ వారు తమ బాధను కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు హీరో నాని.
♥️ @KChiruTweets https://t.co/mB3uh2aJoC pic.twitter.com/xNjm7Rzyfc
— Nani (@NameisNani) January 20, 2022
Niku kuda White Hair vachindhi anna pic.twitter.com/rgjBwVdxIG
— Vamsi vardhan PSPK (@Vamsivardhan_) January 20, 2022