చత్తీస్ గఢ్- ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆఖరికి మైనర్ బాలికలను కూడా వదలడం లేదు దుర్మార్గులు. అభం శుభం తెలియని వారిపై కసాయి వాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా చత్తీస్ గఢ్ లో ఓ మైనర్ బాలికను యువకుడు బలాత్కారం చేశాడు.
ఛత్తీస్ గఢ్ లోని జష్ఫూర్‌కు చెందిన ఒక యువకుడు తన స్నేహితుని సోదరిపై అత్యాచారం జరిపాడు. ఆ బాలికకు అర్థరాత్రి దాటాక మెసేజ్ పంపించి, బయటకు రావాలని పిలిచాడు. ఆ బాలిక ఇంటి నుంచి బయటకు రాగానే ఆమెను బలవంతంగా దగ్గరలోని ఓ పాడుపడిన భవనంలోనికి లాక్కెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేసి, అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన అనంతరం ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా కుటుంబ సభ్యులకు చెప్పింది.
బగీచా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న అజయ్ కుమార్ ప్రజాపతి స్థానికంగా ఉంటున్న ఒక యువకునితో స్నేహం చేస్తున్నాడు. దీంతో అతను స్నేహితుని ఇంటికి తరచూ వస్తూపోతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతనికి స్నేహితుని 13 ఏళ్ల సోదరితో పరిచయం ఏర్పడింది. ఓ రోజూ ఎప్పటిలాగే రాత్రివేళ ఆ బాలిక చదువుకుంటున్న సమయంలో, అజయ్ ఆ బాలికకు వాట్సాప్ లో తనను కలుసుకునేందుకు ఇంటి నుంచి బయటకు రావాలంటూ మెసేజ్ పంపించాడు.
పిలిచింది తన అన్నయ్య ఫ్రెండే కదా అని ఎటువంటి సందేహం లేకుండా ఆమె బయటకు వచ్చింది. వెంటనే అజయ్ ఆ బాలికను సమీపంలోని పాడుబడిన భవనంలోకి లాక్కెళ్లి, అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి, జరిగిన విషయాన్ని ఇంట్లోనివారికి చెప్పింది. వారు ఈ సంగతిని పోలీసులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని కేవలం మూడు గంటల వ్యవధిలో పట్టుకున్నారు.