కొన్ని రోజుల క్రితం మన దేశంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో పావురాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. వీటి కాళ్లకు జియో ట్యాగ్ ఉండటంతో.. ఇవి శత్రుదేశాలకు చెందినవి అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు వీటిని అదుపులోకి తీసుకుని విచారించడం కూడా జరిగింది. తాజాగా ఈ కోవకు చెందని సంఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ కోడిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆ వివరాలు..
పెంటగాన్‌లోని సెక్యూరిటీ ఏరియా చుట్టూ తిరుగుతున్నఓ కోడిని పట్టుకున్నట్టు స్థానిక జంతు సంక్షేమ సంస్థ తెలిపింది. వర్జీనియాలోని ఆర్లింగ్టన్‌లోని యానిమల్ వెల్ఫేర్ లీగ్, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో సోమవారం తెల్లవారుజామున సంచరిస్తోన్న ఓ కోడిని అధికారులు చూశారు. అనుమానంతో వెంటనే దానిని పట్టుకున్నారు. అయితే ఆ కోడి పెంటగాన్ పరిసరాల్లోకి ఎలా వచ్చిందనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.
అధికారులు అదుపులో ఉన్న ఈ కోడిని హెన్ని పెన్నిగా పిలుస్తున్నారు. అంతేకాక స్థానికంగా కోళ్ల ఫామ్ ఉన్న ఒక వ్యక్తి ఈ కోడిని తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు. అయితే త్వరలో దానిని స్థానిక జంతు సంరక్షణా కేంద్రానికి తరలించనున్నట్లు తెలిపారు. ఏదిఏమైనా ఇప్పటి వరకూ అనుమానంతో మనుషులను అదుపులోకి తీసుకోవడం చూశాం.. కానీ ఇలా ఓ కోడిని అదుపులోకి తీసుకోవడం.. దీనికి ఇంత సీన్ క్రియేట్ చేయడం ఇదే ప్రథమం అయి ఉంటుంది. కోడి జాగ్రత్త.. పులావ్ వండుకు తినేరు అంటూ నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.
Wandering hen taken into custody at Pentagon security area https://t.co/FW3OEnLB1e pic.twitter.com/Mj5xYMAeVX
— New York Post (@nypost) February 2, 2022