ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ, రెండేళ్ల క్రితం మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. వ్యాయామం చేయడం, కంటినిండా నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. ఆరోగ్యకరమైన ఆరోగ్యం అనగానే అందరికీ సలాడ్స్ కూడా గుర్తొస్తాయి. అయితే చాలామంది ఈ సలాడ్స్ తినేందుకు ఆసక్తి చూపించరు. కానీ, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు. సలాడ్స్ ఆరోగ్యకరమైన ఆహారమే కాదు.. […]
కంటినిండ నిద్రపోవడం అనేది మన ఆరోగ్యానికి చాలా అవసరం. మారిన కాలానికి అనుగుణంగా ఈ రోజుల్లో చాలా మంది నైట్ షిఫ్ట్స్ అంటూ రాత్రుళ్లు ఉద్యోగాలు చేస్తూ సరిపడ నిద్రపోవడం లేదు. దీంతో అనేక సమస్యలను కొని తెచ్చుకుని చివరికి ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఏకంగా 8 నుంచి 10 గంటల వరకు నిద్రపోతుంటారు. రోజూ 8 గంటల మించి నిద్రపోవడం అంత మంచిది కూడా కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే […]
రక్తపోటు మారుతున్న జీవన విధానం వల్లనో, ఆరోగ్యం మీద శ్రద్ధ లేకనో ఇప్పుడు చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు. కొందరైతే అధిక రక్తపోటు బాధితులు అవుతున్నారు. అందుకు చాలా వరకు స్వయంకృతాపరాధాలే ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే తప్పులు, నిర్లక్ష్య ధోరణి వల్లనే అధిక రక్తపోటు బారిన పడుతుంటారు. అయితే రక్తపోటు ఉన్న వ్యక్తులు ఇవి ఫాలో అయితే తప్పకుండా ఫలితం ఉంటుంది. మీరు శారీరకంగా కూడా ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా మారుతారు. ధూమపానం మానేయండి: […]
హాయిగా సాగిపోతున్న జీవితంలో అనుకుని ప్రమాదాలు జరిగి కుటుంబం ఛిన్నాభిన్నం అవుతోంది. మానసికంగా, శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో నష్టం జరుగుతుంది. అప్పటి వరకు కూడబెట్టుకున్న సొమ్ము ఒక్కసారిగా వైద్య చికిత్సకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలానే సమయానికి డబ్బులు లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడుతుంటాము. ఇలాంటి ఆపద సమయాల్లో మనల్ని ఆదుకునేవి ఆరోగ్య పాలసీలు. చాలా మంది ఆరోగ్యపాలసీలు వృథా ఖర్చుగా భావిస్తుంటారు. కరోనా మహమ్మారి ప్రభావంతో అన్ని వయస్కుల వారికి వీటి ప్రాధాన్యత […]
మారిన కాలానికి అనుగుణంగా ఇప్పడు చాల మంది ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది. తాజా కూరగాయలు, మిగిలిన ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ వంటివి భద్రపరుచుకుని తర్వాత తింటున్నారు. అసలు ఫ్రిజ్ లో పెట్టిన ఆహారం తినడం మంచిదేనా? ఇలా ఫ్రిజ్ లో దాచి పెట్టిన ఆహారం తినడం వల్ల ఏమైన దుష్ప్రభావాలు ఉన్నాయా? అసలు నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లల్లో […]
తిండి తినటంలో మనం చేసే పొరపాట్లు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం.. అన్నదే కాదు ఎలా తింటున్నాం అన్నది కూడా ముఖ్యమే. కొంతమంది చేతిని కడుక్కోవటం ఇష్టం లేకో.. వేరే కారణాల వల్లో స్పూనుతో భోజనం చేస్తూ ఉంటారు. ఇలా స్పూనుతో భోజనం చేయటం మంచిదేనా? లేక చెయ్యితో భోజనం చేస్తే మంచిదా.. ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయులు చేత్తో తిండి తినటం అన్నది కొన్ని […]
మేనరికపు పెళ్లిళ్లపై ప్రజలలో భిన్నరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీటిని సమర్ధించే వారు కొందరైతే.. విమర్శించే వారు మరి కొందరు. ఏదేమైనా మేనరికపు వివాహం చేసుకుంటే అవలక్షణమైన సంతానం కలుగుతుందన్న అపోహ ఉన్నదన్నది మాత్రం వాస్తవం. దేశంలో.. అందునా దక్షిణాదిన మేనరికపు వివాహాలు ఎక్కువ. అన్నదమ్ముల పిల్లలను అక్క చెల్లెళ్ల పిల్లలకు ఇవ్వడం, మేనకోడలిని మేనమామకు ఇవ్వడం సర్వసాధారణం. ఆస్తి బయటి వారికి పోకూడదనే ఆలోచనతో కట్టబెట్టేవారు కొందరైతే, దగ్గరి వాళ్లను చేసుకుంటే అనుబంధాలు మరింత బలపడతాయన్న ఆలోచనతో […]
చలికాలంలో శరీర బరువు పెరుగుతుందా? పొట్ట ముందుకు వచ్చేసిందని తెగ బాధపడిపోతున్నారా? మీ సమస్యను ఇంట్లో వాళ్లకి, స్నేహితులకు చెబితే.. వారూ ఇదే విధంగా స్పందిస్తున్నారా..? ఇది మీ ఒక్కరి సమస్యే కాదూ, అనేక మంది ఎదుర్కొంటున్నదే. దానికి వాతావరణ పరిస్థితులని సరిపెట్టేసుకున్నా, శరీరంలో జరుగుతున్న మార్పులకు చూసి దిగులు చెందుతున్నాం. అలా అని నోరు కట్టేయగలమా, అంటే అదీ అసాధ్యం. నచ్చిన ఆహారాన్నికొలతలు వేసుకుని తినలేం. కానీ ఈ డిటాక్స్ డ్రింక్స్ తాగి టైర్ల లాంటి […]
రెండు, మూడుల రోజుల నుంచి చలి విపరీతంగా పెరిగిపోయింది. బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి చుక్కలు చూపిస్తోంది. దడ పుట్టిస్తున్న చలి కారణంగా బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యం ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దాదాపు 25 మంది చలి కారణంగా మృత్యువాత పడ్డారు. బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లతో ప్రాణాలు విడిచారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చలి మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. […]
పండగ వచ్చిందంటే చాలు.. తెలుగు లోగిళ్లు.. పచ్చగా కలకళ్లాడతాయి. పండుగకు వారం రోజుల ముందు నుంచే.. పనులు ప్రాంరభమవుతాయి. ఇలు దులిపి.. శుభ్రం చేసుకుంటారు. పండుగ షాపింగ్ ప్రారంభిస్తారు. ఇక పండగ అంటే.. పిండివంటలు తప్పనిసరి. ఎంత పేదవారైనా సరే పండుగ పూట.. ఏదో ఒక పిండివంట తయారు చేసుకుంటారు. ఇక సంక్రాంతి లాంటి పెద్ద పండుగ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనీసం రెండు మూడు రకాల పిండి వంటలు తయారు చేస్తారు. […]