ఈ మధ్య కాలంలో మహిళలపై వేధింపులు ఎక్కువయిపోయాయి. చదువు రాని మొద్దులతో మొదలుపెడితే.. ఉన్నత చదువులు చదివి.. పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగబెడుతున్న వారు సైతం మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం దీనికి అతీతం కాదు. తాజాగా, ఓ రైల్వే టీసీ టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్‌తో దురుసుగా ప్రవర్తించాడు. ఆమెను బూతులు తిట్టడమే కాకుండా.. ఫోన్‌ను రైలునుంచి బయట పడేశాడు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా చెప్పుకొచ్చారు. తన పోస్టులో.. ‘‘ నేను మా బంధువుల పెళ్లి ఉంటే కోల్‌కతా వెళ్లాను.
పెళ్లి అయిపోయిన తర్వాత బిహార్‌కు తిరుగు ప్రయాణం అయ్యాను. ఇందుకోసం కోల్‌కతా జోగ్‌బని రైలును ఎక్కాను. నాకు అప్పర్ సీటు వచ్చింది. లోయర్ బెర్త్ ఖాళీ అవ్వటంతో వేరే ప్రయాణికుడితో మాట్లాడుకుని అందులో కూర్చున్నాను. రైలు మాల్దా దగ్గరకు వచ్చింది. అప్పుడు ఓ టిక్కెట్ చెకింగ్ సిబ్బంది నా దగ్గరకు వచ్చాడు. నాతో తప్పుగా మాట్లాడాడు. నా ఫోన్‌ను కూడా రైలునుంచి బయటపడేశాడు. దీంతో నేను ఫరక్కా రైల్వే స్టేషన్ దగ్గర కిందకు దిగాను. అక్కడి రైల్వే పోలీసులను దీనిపై ఫిర్యాదు చేశాను. నాకు ఎదురైన అనుభవాన్ని వారితో పంచుకున్నాను’’ అని రాసుకొచ్చారు.
కాగా, హసీన్ జహాన్‌కు స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీతో 2014లో పెళ్లయింది. కొన్నేళ్లు సాఫీగా సాగిన వీరి వైవాహిక జీవితం ఆ తర్వాత బీటలు బారింది. కాపురంలో గొడవలు రావటం మొదలయ్యాయి. 2018లో హసీన్ జహాన్.. షమీపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. షమీ తనపై గృహ హింసకు పాల్పడ్డాడని, క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేశాడని ఆరోపించింది. తన భర్తకు అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయని అంది. ఇక అప్పటినుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ఒంటరిగా జీవితాన్ని వెల్లదీస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది.
ఇవి కూడా చదవండి: గూగుల్ టెక్కీకి టోకరా.. ఇంటికి పిలిచి.. గదిలో బంధించి బలవంతంగా పెళ్లి చేసుకున్న యువతి!