రాజకీయాల సంగతి పక్కన పెడితే.. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ చేసిన కృషిని.. తెలంగాణ సమాజం ఎన్నటికి మరిచిపోదు. రాష్ట్ర సాధన కోసం పార్టీ స్థాపించి.. సుమారు 14 ఏళ్ల పాటు అనితర పోరాటం చేసి.. ఎన్నో ఉద్యోమాలు, ఆందోళనలు చేపట్టి.. తెలంగాణ వాసులు 60 ఏళ్ల కలను నిజం చేశారు కేసీఆర్. ఉద్యమంలో ఎందరో పాల్గొన్నప్పటికి.. దాన్ని ముందుకు తీసుకెళ్లిన బలమైన శక్తి మాత్రం కేసీఆర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వత.. టీఆర్‌ఎస్ తరఫున అధికారం చేజిక్కించుకుని.. నూతన రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 2018 ఎన్నికల్లో మరోసారి సీఎం పదవి చేపట్టారు కేసీఆర్.
ఇక నూతన రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్.. అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. అందులో రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, బాలింతలకు ఇచ్చే కేసీఆర్ కిట్ వంటి పథకాలు ముందు వరుసలో ఉంటాయి. అలానే వృద్దులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులకు నెలకు రెండు వేల రూపాయల పెన్షన్ అందజేస్తూ.. వారి పాలిట పెద్దబిడ్డ, అన్నగా ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు కేసీఆర్. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ ద్వారా దేశరాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇక తెలంగాణలో కేసీఆర్ క్రేజ్‌కు అద్దం పట్టే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
ప్రభుత్వ ఆస్పత్రులో డెలివరీలను ప్రొత్సాహించడం కోసం కేసీఆర్.. ఆర్థిక సాయం అందజేయడమే కాక.. చిన్నారలకు అవసరమైన అన్ని రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కిట్ మీద కేసీఆర్ ఫోటో ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ చిన్నారి.. కిట్ మీద కేసీఆర్ ఫోటో చూస్తూ.. నా తాత.. నా తాత అంటూ ఫోటోకి ముద్దులు పెడుతుంది. ఇంతలో పక్కనే ఉన్న మహిళ.. నీ తాత కాదు. నా తాత అంటూ కిట్‌ను లాక్కుంటుంది. ఆ మాటతో చిన్నారికి కోపం వస్తుంది. కేసీఆర్ ఫోటోపైన ఉన్న మహిళ చేతిని పక్కకు తోసేసి.. మరి నా తాత అంటూ ముద్దులు పెడుతుంది. దాంతో సదరు మహిళ ఆ చిన్నారి కోపం తగ్గించడానికి.. నీ తాతే తల్లి అని చెప్పుకొచ్చింది.
ఇక చిన్నారి ముద్దు ముద్దు అల్లరికి సంబంధించిన వీడియోని మంత్రి హరీష్ రావు తన ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ‘‘కేసీఆర్ కిట్‌ను చూస్తూ తాత.. తాత.. అంటూ ఆడుతున్న ఆ బిడ్డ సంబరం చూస్తే మనస్సు పొంగిపోతున్నది. తల్లికి మేనమామగా, బిడ్డకు తాతయ్యగా కేసీఆర్ గారు అందించిన కేసీఆర్ కిట్ ఆప్యాయతతో కూడిన సంరక్షణను అందిస్తున్నది’’ అనే క్యాప్షన్‌తో వీడియోని పోస్ట్ చేశాడు హరీశ్ రావు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకునే వారి సంఖ్య పెరిగిందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
కేసీఆర్ కిట్ ను చూస్తూ తాత.. తాత.. అంటూ ఆడుతున్న ఆ బిడ్డ సంబరం చూస్తే మనస్సు పొంగిపోతున్నది.. తల్లికి మేనమామగా, బిడ్డకు తాతయ్యగా కేసీఆర్ గారు అందించిన కేసీఆర్ కిట్ ఆప్యాయతతో కూడిన సంరక్షణను అందిస్తున్నది. pic.twitter.com/ufh6w5mtrD
— Harish Rao Thanneeru (@trsharish) December 17, 2022