నెల్లూరు రూరల్- సినిమా.. అదో రంగుల ప్రపంచం. సినిమాల్లో నటించాలని చాలా మందికి కల. ఒక్కసారైనా వెండి తెరపై తళుక్కుమనాలని లక్షల మంది ఆశ. అందుకే చాలా మంది సినిమాల్లో ఛాన్స్ కోసం స్టూడియోల చుట్టూ, నిర్మాతలు, దర్శకుల చుట్టూ తిరుగుతుంటారు. ఐతే సినిమా పిచ్చితో వచ్చేవాళ్లను కొంత మంది కేటుగాళ్లు మోసం చేస్తుంటారు. మనం చాలా సందర్బాల్లో ఇలాంటి ఘటనలను చూశాం. సినిమా అవకాశాల పేరుతో కొందరు అమ్మాయిలను లైంగిక అవసరాలకు వాడుకుంటున్న సంఘటనలైతే కోకొల్లలు.
తాజాగా నెల్లూరులో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ప్రవీణ్ అనే దర్శకుడు చెంగాలమ్మ మహత్యం మూవీ క్రియేషన్స్ పేరిట సినిమా ఆఫీస్ ను ప్రారంభించాడు. సినిమా అవకాశాల పేరుతో అమాయకులైన అమ్మాయిలకు వల వేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నాడు. సినిమాల్లో నచించాలన్న కోరికతో ఓ యువతి ప్రవీణ్ దగ్గరకు వచ్చి, చివరికి అతడి లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది.
సినిమా ఆఫర్స్ ఉన్నాయంటూ టీవీలో యాడ్ ఇచ్చాడు ప్రవీణ్ కుమార్. అది చూసి యువతి ఫోన్ చేసి మాట్లాడింది ఈ క్రమంలో ఆడిషన్ చేసి ఆ యువతిని ఎంపక చేశారు. షూటింగ్ కోసం వెళ్లిన మొదటిరోదే ఆ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ప్రవీణ్. కానీ మా ఇంట్లో ఒప్పుకోరని ఆ యువతి చెప్పిందట. అదిగో అప్పటి నుంచి ఆ యువతికి ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పెట్టడం స్టార్ట్ చేశాడు ప్రవీణ్. ఆ తరువాత కొన్నాళ్లకు ఫొటో షూట్ చేశారు. అక్కడ ఆ యువతి దిగిన ఫొటోలు ప్రవీణ్ తన దగ్గర పెట్టుకున్నాడు.
ఆ ఫొటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు ప్రవీణ్. ఈ క్రమంలో ప్రవీణ్‌కు పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న విషయం తెలిసిందా యువతికి. అప్పటి నుంచి ప్రవీణ్ ను దూరం పెట్టిందా యువతి. ఐతే ఆమె ఫొటోలు చూపించి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఏంచేయాలో తెలియక ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆ యువతికి ప్రాణాపాయం తప్పింది. జరిగింది తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ప్రవీణ్ పరారీలో ఉన్నాడు