ఆంధ్రప్రదేశ్ లో సంచలన సృష్టించిన గుంటూరు రమ్య హత్య కేసు ఇప్పట్లో ఎవరూ మరచిపోలేరు. పట్టపగలే ఆ మృగాడు.. రమ్యపై కత్తితో దాడి చేసి.., ఆమెని పొట్టన పెట్టుకున్నాడు. ఈ సమయంలో చుట్టూ మనుషులు ఉన్నా, ఒక్కరు కూడా రమ్యని కాపాడే ప్రయత్నం చేయలేదు. దగ్గరికి వెళ్తే.., నిందితుడు తమపై కూడా దాడి చేస్తాడేమో అని అంతా మౌనంగా చోద్యం చూస్తూ ఉండిపోయారు. కానీ.., ఏ ఒక్కరైనా కాస్త దైర్యం చేసి ముందడుగు వేసుంటే ఈరోజు రమ్య ప్రాణాలతో మిగిలి ఉండేది. కానీ.., ఏపీ పోలీసులు నిందుతుడు శశికృష్ణను 24 గంటలు గడవక ముందే పట్టుకోవడం విశేషం. అయితే.., నిందుతుడు శశికృష్ణను పట్టుకోవడంలో కీలక వ్యవహిరించింది మాత్రం హెడ్‌కానిస్టేబుల్ మహ్మద్ రఫీ. ప్రాణాలకి తెగించి మరీ మహ్మద్‌రఫీ హంతకుడిని పట్టుకోవడంతో ఇప్పుడు ఆయనపై ప్రశంసలు జల్లు కురుస్తోంది.
రమ్యను కత్తితో పొడిచిన తర్వాత శశి అక్కడ నుండి పరారయ్యాడు.తరువాత అతను ములకలూరు సమీపంలో ఉన్నట్టుగా ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుంటూరు పోలీసులు గుర్తించారు. వారు వెంటనే నరసరావుపేట పోలీసులకు సమాచారం అందించారు. ముప్పాళ్లలో పోలీస్ స్టేషన్ అప్పుడే హెడ్‌కానిస్టేబుల్ మహ్మద్ రఫీ విధుల్లో ఉన్నాడు. తన సొంత ఊరు కూడా పక్కనే ఉన్న పమిడిపాడు కావడంతో రఫీకి ఆ ప్రాంతం అంతా కొట్టిన పిండి. దీంతో.., నిందితుడిని పట్టుకోవడానికి సిబ్బందితో కలసి బయలుదేరాడు.
ఈ లోపు శశి ములకలూరు పంట పొలాల్లోకి పారిపోయాడు. పోలీసులు కూడా అతన్ని వెంబడించారు. కానీ.., శశి తన దగ్గరున్న కత్తితో పోలీసులను బెదిరించాడు. కానీ.., హెడ్‌కానిస్టేబుల్ రఫీ మాత్రం ఆ బెదిరింపులకి భయపడలేదు. చాకచక్యంగా తోటి సిబ్బంది సాయంతో నిందితుడిని వెనుకవైపుగా వెళ్లి పట్టుకున్నాడు. ఇంఛార్జ్ డీఐజీ రాజశేఖర్, రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ, అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్‌లు అభినందించి సన్మానించారు. మహ్మద్ రఫీలో ఉన్న దైర్యం ఏ ఒక్కరిలో ఉండి, రమ్యని కాపాడే ప్రయత్నం చేసి ఉంటే.., ఈరోజు రమ్య మన కళ్ళ ముందే ఉండేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.