నూరేళ్లు హాయిగా జీవించు అని పెద్దలు దీవిస్తూ ఉంటారు. కానీ.., ఈరోజుల్లో 60 ఏళ్ళు బతికితే చాలు.. మిగతాది అంతా బోనస్. అయితే.., ఇప్పుడు ఓ బామ్మ.. ఏకంగా 111వ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐదు తరాల వారసుల సమక్షంలో కేక్ కట్ చేసి.., బోసి నోటి నవ్వులు చిందించిన ఆ మృత్యుంజయురాలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి:
దారుణం.. పొట్టేలుకు బదులుగా మనిషి తల నరికేశాడు..!
గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి మండలం పడమటి పాలెం రాజవోలులో వెంకటజన్ను వెంకట సుబ్బమ్మ అనే బామ్మ ఉన్నారు. ఈమె తాజాగా 110 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 111వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. దీంతో.. బామ్మ 111వ పుట్టినరోజు వేడుకలను ఐదు తరాల వారసులు ఘనంగా నిర్వహించారు. ఇంత వయసు వచ్చినా.. వెంకట సుబ్బమ్మకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడం విశేషం. ఈ బామ్మకి మొత్తం తొమ్మిది మంది సంతానం. ఇక బిడ్డల బిడ్డలు.. వారి బిడ్డలు కూడా వెంకట సుబ్బమ్మ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం విశేషం. “చిన్న తనంలో మేము తిన్న తిండిలో ఎలాంటి కల్తీ ఉండేది కాదు. కాబట్టే.. నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను” అని వెంకట సుబ్బమ్మ చెప్పుకొచ్చింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.