మానవత్వం మంట కలసి పోతోంది. మనిషి నానాటికీ విచక్షణ కోల్పోతున్నాడు. మృగంలా ప్రవర్తిస్తూ.., రక్త దాహం తీర్చుకుంటున్నాడు. తాజాగా గుంటూరులో ఇలాంటి సంఘటనే జరిగింది. స్వతంత్ర దినోత్సవం నాడే ఓ మృగాడు.., బీటెక్ విద్యార్థిని పట్ట పగలు దారుణంగా హత్య చేశాడు.
గుంటూరు రోడ్డులోని కాకాని రోడ్డులో ఈ దారుణం జరిగింది. విద్యార్థినిని ఆ దుండగుడు కత్తితో పలుమార్లు తీవ్రంగా పొడిచాడు.దీంతో.., ఆమె పొట్ట, గొంతులో 6 చోట్ల కత్తిపోట్లు బలంగా దిగాయి. విద్యార్థిని సంఘటనా స్థలంలోనే కన్ను మూయడంతో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
ఈ ఘటనపై అర్బన్ ఎస్పీ హఫీజ్ కూడా స్పందించారు. హత్యకు గల కారణాలు ఇప్పటికైతే తెలియ రాలేదు. హత్యకి గురైన యువతి సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నాము. లాక్ ఓపెన్ చేస్తేనే ఈ కేసులో కీలక సమాచారం లభిస్తుందని గుంటూరు అర్బన్ ఎస్పీ హఫీజ్ తెలియచేశాడు. కారణాలు ఏవైనా.. ఆడ పిల్లల జీవితాలను అర్ధాంతరంగా తుంచేస్తున్న ఇలాంటి మృగాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.