భర్త కాళ్లు మొక్కి భార్య ఆశీర్వాదం తీసుకోవడం ఆచారమని భావించి శుభకార్యల సమయంలో పాటిస్తుంటారు. మారుతున్న కాలంతో పాటు కొన్ని సంప్రదాయాలు మారిపోతుంటాయి. జెండర్ ఈక్వాలిటీ బలంగా కోరుకుంటున్న వారు. భర్త కాళ్లు ఎందుకు మొక్కాలి. భార్య మాత్రమే ఎందుకు ఆ పని చేయాలని వాదించి, ఎదిరించి, సమానత్వం పొందే చైతన్యం పెరుగుతున్న ఈ తరుణంలో సాంప్రదాయలకు భిన్నంగా చాలా సంఘటనలే జరుగుతున్నాయి.
భార్యలు మాత్రమే ఎందుకు మన కాళ్లు మొక్కాలి, వాళ్లు మాత్రమే ఎందుకు ఇంటి పని చేయాలి. మనతో వాళ్లూ సమానమే. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు అని విశాల హృదయంతో వెనకేసుకోస్తున్న భర్తలూ ఉన్నారు. ఆ బ్యాచ్ భర్తలకే లీడర్‌గా నిలిచాడు ఈ యువకుడు. వీడియోలో ఓ జంట గురిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం నవవధువు వరుడి కాళ్లు మొక్కుతుంటే అతను ఆమెను ఆపి, ఆమె కాళ్లను మొక్కుతాడు. ఆశ్చర్యానందంతో వధువు ఎగిరి గంతేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పీయూష్ అవ్‌చార్ అనే వ్యక్తి అకౌంట్ రిల్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియోకు లక్షల్లో లైకులు, వీవ్స్ వస్తున్నాయి.