ప్రేమికులు సాధారణంగా ఎక్కడ పెళ్లి చేసుకుంటారు.. పెద్దలు ఒప్పుకుంటే స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా వివాహాన్ని చేసుకుంటారు. లేదంటే స్నేహితుల సాయంతో పారిపోయి ఏ గుడిలోనో లేదంటే పోలీస్ స్టేషన్, కోర్టు మ్యారేజ్‌లు చేసుకుంటారు.
ప్రేమికులు సాధారణంగా ఎక్కడ పెళ్లి చేసుకుంటారు.. పెద్దలు ఒప్పుకుంటే స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా వివాహాన్ని చేసుకుంటారు. లేదంటే స్నేహితుల సాయంతో పారిపోయి ఏ గుడిలోనో లేదంటే పోలీస్ స్టేషన్, కోర్టు మ్యారేజ్‌లు చేసుకుంటారు. సాధారణంగా ప్రేమ పెళ్లిళ్లు ఇలానే జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వివాహ తంతు మాత్రం కాస్త వింతగానూ, విభిన్నంగానూ జరిగింది. ఇది కూడా ప్రేమ పెళ్లే. బంధువుల మధ్యలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇంతకూ ఆ వింత ఏమిటంటే.. వీరిద్దరూ శ్మశానంలో పెళ్లి చేసుకోవడమే. ఎందుకు శ్మశానంలోనే పెళ్లి చేసుకున్నారన్న డౌట్ వస్తుంది కదా. అయితే ఈ వార్త చదివేయండి.
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఈ వింత పెళ్లి జరిగింది. వివరాల్లోకి వెళితే.. షిర్డీ సమీపంలోని రహతా గ్రామానికి చెందిన గంగాధర్ స్థానిక శ్మశాన వాటికలో కాటి కాపరిగా పనిచేస్తున్నాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆయన కుమార్తె మయూరి కూడా 12వ తరగతి వరకు చదువుకుంది. మనోజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వీరి పెళ్లికి ఒప్పుకున్న గంగాధర్.. తన కుమార్తె వివాహాన్ని తాము నివసించే శ్మశానంలో నిర్వహించాలని వరుడు కుటుంబ సభ్యులను ఒప్పించాడు. ఇందుకు మనోజ్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో.. కుమార్తెకు ఘనంగా శ్మశాన వాటికలో పెళ్లి నిర్వహించి.. విందు ఏర్పాటు చేసి, బహుమతులు కూడా అందించాడు.