Google: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’ అంటే తెలియని వారుండరు. ఇంటర్ నెట్ వాడని వారికి కూడా ‘గూగుల్’ పేరు తెలిసే ఉంటుంది. ఇంత పాపులర్ చెందిన ఈ సెర్చ ఇంజన్‌కు ప్రపంచ వ్యాప్తంగా పదుల కోట్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. ప్రతీ నిత్యం కొన్ని కోట్ల మంది గూగుల్‌ను వాడుతూ ఉన్నారు. గూగుల్ తన సేవలను వివిధ రూపాల్లో యూజర్లకు అందిస్తోంది. అలాంటి వాటిలో జీమెయిల్ ఒకటి. ఈ జీమెయిల్‌కు ప్రపంచ వ్యాప్తంగా 1.8 బిలియన్ మంది యూజర్లు ఉన్నారు. వీరిలో 75 శాతం మంది తమ మొబైల్స్ ద్వారా జీమెయిల్‌ను ఊపయోగిస్తున్నారు. మిగిలిన వారు కంప్యూటర్, ట్యాబ్‌లెట్ వంటివాటిలో వాడుతున్నారు. ఇక, జీమెయిల్ వినియోగించే వారికి గూగుల్ శుభవార్త చెప్పింది.
జీమెయిల్‌ను ఆఫ్‌లైన్ ద్వారా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇంటర్ నెట్ కనెక్షన్ లేకపోయినా యూజర్లు ఇకపై మెయిల్స్‌ను చదవటం, స్పందించటం, అవసరమైన మెసేజ్‌లను సెర్చ్ చేసుకోవటం వంటివి చేయొచ్చని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ మౌంటైన్ వ్యూ తెలిపింది. నెట్‌వర్క్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఈ సదుపాయం ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. జీమెయిల్‌లో కొన్ని సెట్టింగ్‌లు చేసుకోవటం ద్వారా సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది. ఈ సదుపాయం గూగుల్ క్రోమ్‌లో మాత్రమే పనిచేస్తుందని, అది కూడా నార్మల్ మోడ్‌లోనే పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
జీమెయిల్ ఆఫ్‌లైన్ సదుపాయం పొందటానికి ఇలా చేయండి..
ఇవి కూడా చదవండి : Samsung : భారీ ఆఫర్.. శాంసంగ్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.9 వేలకు పైగా తగ్గింపు!