ఈ చివర ఇల్లు ఉంటే ఆ కార్నర్‌లో ఆఫీసు ఉంటుంది. ఆఫీసుకు వెళ్లాలంటే రెండు గంటల ముందు బయలు దేరాల్సిన పరిస్థితి. ఇక రద్దీ సమయాల్లో వెళ్లాలంటే పగలే చుక్కలు కనిపిస్తాయి. పనుల మీద బయటకు వెళ్లాలన్నా, కాలేజీలకు వెళ్లాలన్నా ఈ సమయాల్లో బస్సులను ఆశ్రయించాల్సిందే.
హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఉరుకుల పరుగులతో జీవనం సాగిపోతుంది. ఈ చివర ఇల్లు ఉంటే ఆ కార్నర్‌లో ఆఫీసు ఉంటుంది. ఆఫీసుకు వెళ్లాలంటే రెండు గంటల ముందు బయలు దేరాల్సిన పరిస్థితి. ఇక రద్దీ సమయాల్లో వెళ్లాలంటే పగలే చుక్కలు కనిపిస్తాయి. పనుల మీద బయటకు వెళ్లాలన్నా, కాలేజీలకు వెళ్లాలన్నా ఈ సమయాల్లో బస్సులను ఆశ్రయించాల్సిందే. ఈ సమయాల్లో బస్సులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సొంత వాహనాల్లో వెళదామంటే ట్రాఫిక్ బీభత్సంగా ఉంటుంది. ఈ ఇబ్బందిని కొంత వరకు ఉపశమనం కలిగిస్తుంది మెట్రో రైలు. నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రయాణీకులకు బెస్ట్ ట్రావెల్ ఆప్షన్‌గా మారిపోయింది. ఇందులో కూడా రద్దీ సమయాల్లో ప్రయాణించలేని పరిస్థితి. నిల్చునేందుకు కాదు కదా కాలు కూడా పెట్టలేని దుస్థితి. దీంతో ఉసూరుమంటున్నాడు సగటు ప్రయాణీకుడు.
ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం రూట్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ కష్టాలను తీర్చేందుకు శుభవార్తతో మన ముందుకు వచ్చింది హైదరాబాద్ మెట్రో. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో బోగీలను పెంచాలనే డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంది. ఎట్టకేలకు బోగీలను పెంచేందుకు ఆమోదించింది. ఇప్పడున్న మెట్రో రైలుకు అదనంగా మూడు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం అదనపు కోచ్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి సమయం, ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో అద్దె ప్రాతిపదికన బోగీలను తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అద్దెకు తీసుకునేందుకు చెన్నై, నాగపూర్ మెట్రో అధికారులతో హైదరాబాద్ ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఆగస్టులోగా ఇవి అందుబాటులోకి రానున్నాయి.
అలాగే అదనపు కోచ్ కొనుగోలు చేయడం వల్ల మెట్రో రైళ్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఫ్లాట్ ఫాం పొడవు, ట్రాక్, ఎలివేటెడ్ కారిడార్లు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. రద్దీగా ఉంటే ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం రూట్లలో మెట్రో రైళ్లకి ఈ అదనపు బోగీలు జత చేయనున్నారు. మెట్రో ప్రారంభంలో ఆదరణ కొరవడినా.. రానూ రానూ వీటిలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. తొలి నాళ్లలో రోజుకు లక్ష మంది మాత్రమే ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు రోజుకు 5.10 లక్షల మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుండి రాత్రి వరకు రద్దీగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగీల పెంపు ఉపశమనే చెప్పాలి. ఇక ప్రయాణీలకు కష్టాలు తీరుతాయోమో చూడాలి మరీ.